‘బిగ్ బాస్‌’ని వీడని చిక్కులు.. ఏపీ హైకోర్టులో మరో పిల్

|

Jul 26, 2019 | 9:45 PM

సంచలన  బిగ్ బాస్ 3 తెలుగు రియాలిటీ షో ప్రసారం ను నిలిపి వేయాలని కోరుతూ దర్శక, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి  ఆంధ్రప్రదేశ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో కూడా ఆయన పిల్ దాఖలు చేశారు. దానిపై ఈ నెల 29న తుది విచారణ జరగనుంది. బ్రాడ్ కాస్టింగ్ నిబంధనలకు విరుద్ధంగా బిగ్ బాస్ షో ప్రసారాలు చేస్తున్నారని, ఈ రియాలిటీ షో ద్వారా యువత చెడుమార్గంలో వెళ్లే అవకాశం ఉందని […]

బిగ్ బాస్‌ని వీడని చిక్కులు.. ఏపీ హైకోర్టులో మరో పిల్
Follow us on

సంచలన  బిగ్ బాస్ 3 తెలుగు రియాలిటీ షో ప్రసారం ను నిలిపి వేయాలని కోరుతూ దర్శక, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి  ఆంధ్రప్రదేశ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో కూడా ఆయన పిల్ దాఖలు చేశారు. దానిపై ఈ నెల 29న తుది విచారణ జరగనుంది. బ్రాడ్ కాస్టింగ్ నిబంధనలకు విరుద్ధంగా బిగ్ బాస్ షో ప్రసారాలు చేస్తున్నారని, ఈ రియాలిటీ షో ద్వారా యువత చెడుమార్గంలో వెళ్లే అవకాశం ఉందని అంతేకాక సెలెక్షన్‌లో భాగంగా మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ కేతిరెడ్డి తన పిటిషన్ ద్వారా కోర్టుకు తెలిపారు.   షో వెంటనే నిలిపివేయాలని కోరారు. ఇప్పటికే బిగ్ బాస్ చుట్టూ అనేక వివాదాలు ముసురుకున్నాయి. మరి తాజా పిల్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.