
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ రీసెంట్గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి పలు కాంట్రవర్సీలతో హాట్ టాపిక్‌గా మారింది. వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్స్‌లో రష్మీ దేశాయ్, దల్జీత్ కౌర్, కోయినా మిత్రా, షెహనాజ్ గిల్ ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్లో భాగంగా మొదటి కంటెస్టెంట్‌గా దల్జీత్ కౌర్ ఎలిమినేట్ అయింది. ఇక రెండో కంటెస్టెంట్‌గా కోయినా మిత్రా ఇవాళ ఎపిసోడ్లో ఎలిమినేట్ కానుంది.
ఇది ఇలా ఉండగా దల్జీత్ కౌర్ ఎలిమినేషన్‌కు గురి కావడం పట్ల నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. హౌస్‌లో ఉన్న మంచి వ్యక్తుల్లో ఒకరైన దల్జీత్‌ను ఇలా అర్ధాంతరంగా బయటికి పంపించడం కరెక్ట్ కాదని బిగ్ బాస్‌పై మండిపడుతున్నారు. ఆమెను వైల్డ్ కార్డు ఎంట్రీతో మరోసారి హౌస్‌లోకి పంపించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
దల్జీత్ కౌర్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ‘ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూ’ సీరియల్‌తో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ఇన్ని రోజులు ఫెయిర్ ప్లేయర్‌గా ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆమెను ఇలా ఎలిమినేట్ చేయడం ఎవ్వరికీ కూడా నచ్చలేదని చెప్పాలి. ఏది ఏమైనా బిగ్ బాస్ అంటేనే.. ఏదైనా జరగొచ్చు. చూడాలి రాబోయే రోజుల్లో దల్జీత్ మళ్ళీ హౌస్‌లోకి తిరిగి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.