కన్నీళ్లు పెట్టిన బిగ్‌బాస్-3 హౌస్ కంటెస్టెంట్స్..!

Heart Touching Performances by Bigg Boss 3 contestants, కన్నీళ్లు పెట్టిన బిగ్‌బాస్-3 హౌస్ కంటెస్టెంట్స్..!

ఇప్పుడు ఆ ఇంటికి కొత్త కళ వచ్చింది. ఇంటి సభ్యులకు కొత్త బంగారు లోకం చూపించేందుకు కొత్త కొత్వాళ్ వచ్చాడు. ఇన్నాళ్లూ కెప్టెన్ లేని ఆ ఇంటికి కెప్లెనొచ్చాడు. మరోవైపు ఇంటి సభ్యుల మాటల యుద్ధానికి మాత్రం బ్రేకులు పడటం లేదు.. స్నేహితులు కాస్తా బద్ధ శత్రువులగా మారి.. డైలాగ్ వార్‌కు తెరలేపుతుంటే.. మరికొందరు కొత్త స్నేహానికి కొత్త రూట్ వెతుక్కుంటున్నారు. 11 రోజుల బిగ్‌బాస్ జర్నీలో.. ఊహించని మలుపులు.. ఆసక్తికరమైన సన్నివేశాలు.. చోటుచేసుకున్నాయ్.. మరి కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో ఆ ఇల్లు మారుతుందా..? ఇంటి సభ్యుల మధ్య ఫస్ట్రేషన్ తగ్గుతుందా..?

అయితే.. బిగ్‌బాస్-3 హౌస్‌లో కంటెస్టెంట్‌లు ఎందుకు భావోద్వేగానికి గురయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం.. బిగ్‌బాస్.. ఇంటి సభ్యులకు పవర్ గేమ్ టాస్క్ ఇస్తాడు.. ఇందులో డైమెండ్ గెలుచుకున్నవాళ్లకు హౌజ్‌మెంట్స్‌పై పెత్తనం చేసే అవకాశాన్ని ఇస్తాడు. వజ్రాన్ని చేజిక్కించుకున్న సభ్యుడు.. రాజుగా ఇంటి సభ్యులపై జులం చెలాయించవచ్చు. తనకిష్టమైన పనులు చెయ్యించుకోవచ్చన్నమాట.

ఈ టాస్క్.. వరుణ్, అలీ, హిమజ వజ్రాలు దక్కించుకుంటారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్క్‌లు అప్పగించారు. కింగ్స్ చెప్పినట్లు హౌజ్‌మెంట్స్ అందరూ ఎంటర్‌టైన్ చేస్తూ కడుబుబ్బా నవ్విస్తూంటారు. ఈ సందర్భంగానే వాళ్ల వాళ్ల గోల్స్ గురించి చెబుతూంటారు. ఆ గోల్రీచ్ అయ్యేందుకు వాళ్లు పడే కష్టం విన్నప్పుడు మనం ఆటోమెటిక్‌గా భావోద్వేగానికి గురవుతాం. బిగ్‌బాస్ హౌజ్‌లోనూ అదే జరిగింది. ఇంటి సభ్యులు తాము లైఫ్‌లో పడ్డ స్ట్రగుల్స్ గురించి చెబుతుంటేం.. అందరూ ఎమోషన్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *