Breaking News
  • రేపు నెల్లూరు జిల్లా కావలిలో నారా లోకేష్‌ పర్యటన. ఆత్మహత్య చేసుకున్న టీడీపీ కార్యకర్త కార్తీక్‌ కుటుంబాన్ని పరామర్శించనున్న నారా లోకేష్‌.
  • విజయవాడ: ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు చనిపోతున్నారు. కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే-నారా లోకేష్‌. భవన నిర్మాణ కార్మికులకు టీడీపీ అండగా పోరాడుతోంది. ఏ పంది కొక్కులు నేడు ఇసుక తింటున్నాయో తేలాలి. టీడీపీ కట్టిన పంచాయతీ ఆఫీస్‌లకు వైసీపీ రంగులు వేసుకుంటోంది. డౌన్‌ డౌన్‌ సీఎం అంటున్నా.. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి-నారా లోకేష్‌
  • రాఫెల్‌పై రాహుల్‌ గాంధీ ఆరోపణలు అవాస్తవమని.సుప్రీం తీర్పుతో తేటతెల్లమైంది-బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు లక్ష్మణ్‌. మోదీ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. జఠిల సమస్యలను సామరస్య పూర్వకంగా మోదీ పరిష్కరించారు. తెలంగాణలో అశాంతి, అసంతృప్తి నెలకొంది. అధికార పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే. అందుకే అందరూ బీజేపీలో చేరుతున్నారు-లక్ష్మణ్‌
  • ముగిసిన ఆర్టీసీ, పొలిటికల్‌ జేఏసీ సమావేశం.
  • ఇసుక కొరతపై 12 గంటల పాటు దీక్ష చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో జె-ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు బాధితులకు అండగా నిలిస్తే దాడులు చేస్తున్నారు. ఇసుక లేక అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. నాపై కోపంతో అన్న క్యాంటీన్లు మూసేశారు-చంద్రబాబు
  • తిరుమల: సామాన్య భక్తునిగా శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పేర్నినాని. సుపథం మార్గంలో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పేర్ని నాని
  • ఇసుక కొరత వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది నష్టపోయారు. చంద్రబాబు మీద కక్షతోనే భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు. వైసీపీ ప్రభుత్వం జాతీయ పతాకాన్ని అవహేళన చేసింది.సచివాలయాలకు వైసీపీ రంగులేసే జగన్‌కు గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు-ఎంపీ రామ్మోహన్‌నాయుడు

బిగ్ బాస్‌ 3లో కౌశల్ శిష్యుడు.. మరి టైటిల్ విన్నర్ అతడేనా?

నేచురల్ స్టార్ నాని హోస్టుగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీజన్‌లో ఎటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా హౌస్‌లోకి అడుగుపెట్టిన కౌశల్ మందా అనూహ్యంగా భారీ మెజార్టీతో టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా కౌశల్ బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఫైవ్ కంటెస్టెంట్లపై స్పందిస్తూ ఓ స్పెషల్ వీడియో చేశాడు.

శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజాల గురించి మాట్లాడిన కౌశల్.. విన్నర్ ఎవరవుతారన్నది ఆడియన్స్ నిర్ణయిస్తారని చెబుతూ.. తాను అందరికి సపోర్ట్ చేస్తూ న్యూట్రల్‌గా ఉంటానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలిచినా తనకు సంతోషమేనని కౌశల్ అన్నాడు.

అలీ రెజా గురించి కౌశల్ మాట్లాడుతూ ’18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మోడల్‌గా అలీకి ట్రైనింగ్ ఇచ్చానని.. మేకోవర్ చేసి ఫస్ట్ ఫోటోషూట్ కూడా చేశానని అన్నాడు. అలీ తొలి యాడ్ ఫిల్మ్‌ను డైరెక్ట్ చేసి.. ఫస్ట్ రెమ్యునరేషన్ కూడా నేనే ఇచ్చాను. అలాంటి అలీ రెజా బిగ్ బాస్ ఫైనల్స్ వరకు చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని బిగ్ బాస్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ మందా చెప్పుకొచ్చాడు.