చైనా కబంధ హస్తాల్లోకి ఆఫ్గన్
ఆఫ్గన్ సంక్షోభానికి చైనా వ్యూహమే కారణమా?
ఇంతకి ఆఫ్గన్‌లో చైనా ఇంట్రెస్టులేంటి?
Big News Big Debate: భారత్ వ్యతిరేక కుట్రలు నిరంతరాయంగా సాగిస్తోంది చైనా. సరిహద్దుల్లో ఉండే దేశాలను కలుపుకుని ఇండియాపై కత్తులు దూస్తున్న చైనా.. తాజాగా ఆఫ్గనిస్తాన్‌లో పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఓవైపు తాలిబన్లకు సాయం చేస్తూనే.. ఆఫ్గన్ ప్రభుత్వానికి స్నేహ హస్తం పేరుతో వెన్నుపోటు పొడిచిన డ్రాగన్ తన కుట్రలకు పదును పెడుతుందా.? పాకిస్తాన్ ను ఇండియాపైకి ఎగదొస్తున్న చైనా.. ఆఫ్గన్ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకుని ఇండియాకు వ్యతిరేకంగా తాలిబన్లను ప్రయోగించబోతుందా.?
చైనాకు ఇండియా స్నేహ హస్తం అందించినా… పాముకు పాలు పోసి పెంచినట్టు డ్రాగన్ విషమే గక్కుతోంది. సరిహద్దుల్లో సైన్యాలను మోహరించి కవ్విస్తున్న చైనా.. నేపాల్, భూటాన్ వంటి దేశాలపై ఒత్తిడి తెచ్చి సరిహద్దు వివాదాలను తెరపైకి తెచ్చేలా చేసింది. కొద్ది నెలలుగా ఆఫ్గన్‌ను కూడా మనపై ప్రయోగించాలని చూస్తుందా? కొంతకాలం క్రితం పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రులతో సమావేశమైన చైనా విదేశాంగమంత్రి వాంగ్ ఈ ఇండియాకు వ్యతిరేకంగా కుట్రలు చేసినట్టు ఆరోపణలున్నాయి. తమకు మద్దతు ఇస్తే.. తామే చేపట్టిన భారీ ప్రాజెక్టులు ఆఫ్గన్‌కు విస్తరిస్తామని ఆశ పెట్టారు. కావాలంటే ఆర్ధికంగా ఆదుకుంటామని ప్రకటించారు. అటు చర్చల పేరుతో ఆఫ్గన్ దేశానికి సహకరిస్తామని మాటతో స్నేహహస్తం అందించి.. చాటుగా తాలిబన్లు దేశాన్ని ఆక్రమించడానికి కావాల్సిన సాయాన్ని వెనక నుంచి చేశారు. ఫలితంగా వారు కోరుకుంటున్న పాలన వస్తోంది.. తాలిబన్ల పాలన అంటే చైనా కబంధహస్తాల్లో ఉండే ప్రభుత్వమే అన్నది బహిరంగ రహస్యమన్న విమర్శలున్నాయి.
భారత్ తో సరిహద్దు వివాదం, కరోనాకు కారణమన్న విమర్శల నేపథ్యంలో ప్రపంచదేశాలు తమను చిన్నచూపు చూస్తున్నాయని భావిస్తున్న చైనా.. పెద్దన్న పాత్ర పోషించాలని తహతహలాడుతోంది. భారత్‌కు గతంలో బలమైన మిత్రదేశాలుగా ఉన్న వాటిని కూడా తమకు అనుకూలంగా మలుచుకుంది. ఇప్పుడు ఆప్గనిస్తాన్‌పై పట్టు సాధిస్తే ఉపఖండంలో అత్యధికంగా నష్టపోయేది భారత్ అవుతుందన్న ఆందోళన ఉంది. పాకిస్తాన్‌తో కలిసి ఆఫ్గన్ తాలిబన్ల సాయంతో కశ్మీర్‌లో మళ్లీ అస్థిర పరిస్థితులు సృష్టించేందుకు కుట్ర చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ సరిహద్దుల్లో మాత్రమే తీవ్రవాదులు చొరబడుతున్నారు.. ఇక తాలిబన్లకు మద్దతు ఇస్తున్న చైనా కూడా ఇండియా వ్యతిరేక ఉగ్రవాద ముఠాలను చూసిచూడనట్టు వదిలేస్తే పరిస్థితి ఏంటి? తాలిబన్‌లపై డ్రాగన్ ఆధిపత్యం మొత్తం ప్రపంచానికే మంచిది కాదన్న అభిప్రాయం బలంగా ఉంది.
ఇంతకి ఆఫ్గన్‌లో చైనా ఇంట్రెస్టులేంటి?
అడుగడుగునా చైనా కుట్రలు
1. BRI-బిల్డ్ రోడ్ ఇన్షియేటివ్ విస్తరణకు లైన్ క్లియర్
2. ఇప్పటికే 60 దేశాలతో రోడ్డు కనెక్టివిటీ
3. పాక్, ఆఫ్గన్ సహా ఇస్తామిక్ దేశాలపై ఆధిపత్యం
4. తన వ్యతిరేకులపై తీవ్రవాదంతో దొడ్డిదారి యుద్ధం
5. పాక్ ఆక్రమిత కశ్మీర్, చైనా సరిహద్దుల్లో తీవ్రవాదులకు అండ
6. ఆఫ్గన్‌లో లక్షల కొట్ల సహజ వనరులపై కన్ను
ఎప్పటి నుంచో ఆఫ్గన్‌పై కుతంత్రాలు
1. సాయం పేరుతో పాగా
2. డెవలప్‌మెంట్ కారిడార్ ఒప్పందం అంటూ పాక్‌తో కలిసి కుట్ర
3. నాటో దళాలు వెళ్లేలా బ్యాక్‌డోర్ పాలిటిక్స్
4. తాలిబన్లతో తరచూ చర్చలు
5. అదే తాలిబన్ల సాయంతో ఆఫ్గన్‌పై ఆధిపత్యం వైపు
కుట్రలను చాలా పద్దతిగా…
1. తాలిబన్లు చేసే ఆక్రమణలకు సాయం
2. చైనా, పాక్, ఆఫ్గన్ త్రైపాక్షిక ఒప్పందం. 8 పాయింట్ ఫార్ములా ( జనవరి 3, 2021)
3. తాలిబన్ పాలన గుర్తించేలా పాక్ చేత ప్రకటన
4. నేడో రేపో చైనా అధికారిక ప్రకటన
ఇప్పటికే భారత్‌కు మొదటినుంచి మిత్రదేశాలుగా ఉన్న వాటిని కూడా శత్రుదేశాలుగా మార్చాలన్న కుతంత్రాలు చేస్తున్న చైనా ఇప్పుడు ఆఫ్గనిస్తాన్‌ను కూడా తన కుట్రలో భాగస్వామిని చేసే అవకాశం ఉందన్న ఆందోళనలున్నాయి. ఇంతకీ భారత్ ఈ ముప్పునుంచి తప్పించుకోవడానికి ఉన్న మార్గాలేంటి? నిపుణులు వాదనలేంటి? ఇవే అంశాలపై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్‌డిబేట్‌లో పలువురు రక్షణ రంగ నిపుణులు తమ అభిప్రాయాలు వెల్లడించారు.. ఫుల్ వీడియో కోసం వాచ్