Big News Big Debate: మునుగోడు యుద్ధం.. తొడ కొడుతున్న నాయకులు.. గెలిచేదెవరు.. నిలిచేదెవరు..?

|

Aug 12, 2022 | 7:07 PM

అంతర్గత ప్రజాస్వామ్యానికి సాటి లేని కాంగ్రెస్‌ పార్టీలో మునుగోడు అగ్గి రగులుతూనే ఉంది. ఎంత తగ్గించాలని అధిష్టానం ప్రయత్నించినా మరింత ఎగసిపడుతున్నాయి తప్ప చల్లారడం లేదు. నియోజకవర్గంలో పాదయాత్రకు సిద్ధమవుతున్న పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని టార్గెట్‌ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

Big News Big Debate: మునుగోడు యుద్ధం.. తొడ కొడుతున్న నాయకులు.. గెలిచేదెవరు.. నిలిచేదెవరు..?
Big News Big Debate
Follow us on

ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్టుంది ప్రధానపార్టీల పరిస్థితి. మునుగోడులో రాజగోపాల్‌ చేత రాజీనామా చేయించి మరీ బీజేపీ యుద్ధం ప్రకటించింది. కమలనాథులు విసిరిన సవాలును కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ స్వీకరించాయి.. కానీ అభ్యర్ధి విషయంలో అంతర్గత పోరుతో సతమతమవుతున్నాయి. అభ్యర్ధిపై ఏకాభిప్రాయం రెండు పార్టీలకు పెనుసవాలుగా మారింది. ఇక బుజ్జగింపుల సంగతి అలా ఉంచితే.. ప్రచార హోరులో మాత్రం మూడు పార్టీలు నువ్వా- నేనా అంటున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మునుగోడులో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి.