Big News Big Debate: ఏ కేసులో అయినా ఈడీ ఎంటర్ అయితే తప్పించుకోవడం కష్టమేనా.. సీబీఐ కంటే కూడా నిందితులు ఈడీ ని చూసి ఎందుకు భయపడుతున్నారు. నిజంగానే అంత పవర్‌ఫులా. డ్రగ్స్ కేసులో తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలను ఈడీ విచారణతో మరోసారి చర్చకు వస్తోంది.
ఎంటర్ ద ఈడీ…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటిదాకా చప్పగా సాగిన విచారణ సినిమా.. ఈడీ ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. మంచి థ్రిల్లర్ మూవీని తలపిస్తోంది డ్రగ్స్ కేసు. సిట్ విచారణ ఆపేసిన దగ్గర నుంచే మళ్లీ సినిమా స్టార్ట్ అయింది. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ఆట మొదలు పెట్టింది ఈడీ. ఈ సీరిస్ సెప్టెంబర్ ఎండ్ వరకూ కంటిన్యూ అవుతుంది. సాధారణంగా ఈడీ వచ్చిందంటే మనీ మేటర్స్ అయి ఉంటాయి. డ్రగ్స్ కోసం వీళ్లు హవాలా రూపంలో మనీ చెల్లించారా? అన్నది ప్రధానంగా విచారిస్తుంది. ఇప్పటికే ముగ్గురు నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన ఈడీ.. ఎక్సైజ్ అధికారుల నుంచి వివరాలు సేకరించింది. సిట్ చీఫ్ శ్రీనివాస్ ఈడీ ఆఫీస్‌కి వెళ్లి వివరాలు అందించారు. ఈపాటికి క్వశ్చన్ పేపర్ సిద్ధమైంది. పూరీ జగన్నాథ్ చెప్పే సమాధానాల ఆధారంగా.. తర్వాతి సెలబ్రిటీలకు ఈడీ ప్రశ్నావళిని సిద్ధంచేసే ఛాన్స్ ఉంది.
తెలుగులోనే కాదు.. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు కూడా ఈడీ కష్టాలు తప్పలేదు. మనీ లాండరింగ్ కేసులో ఆమెను అధికారులు విచారించారు. తీహార్ జైల్లో ఉన్న బడా కేటుగాడు సుఖేశ్ చంద్రశేఖర్‌పై నమోదైన కేసులో జాక్వెలిన్ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. తాజాగా మహారాష్ట్రలో కూడా ఈడీ కలకలం మొదలైంది. శివసేనకు చెందిన ఇద్దరు నాయకుల ఆస్తులపై సోదాలు జరుగుతున్నాయి. ఇందులో మహిళా ఎంపీ బావన గోవాలా కూడా ఉన్నారు. అయితే గతంలో పలువురు సీనియర్ నాయకులు కూడా ఈడీ కేసుల్లో నోటీసులు అందుకున్నారు. కేంద్రమాజీ మంత్రి చిదంబరం వంటి వారు అరెస్టు కూడా అయ్యారు. సెలక్టివ్‌గా అరెస్టులు జరుగుతున్నాయన్న విమర్శలూ ఉన్నాయి. ఇంతకీ తాజాగా రంగంలో దిగిన ఈడీ డ్రగ్స్ కేసులో ఏం తేల్చబోతుంది? ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్ డిబేట్ జరిగింది.. పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి..
(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)