Breaking News
  • తెలంగాణలో మరో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. తెలంగాణ లో ఇప్పటి వరకు 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. తెలంగాణలో కరోనా వైరస్ తో 9 మంది మృతి చెందారు.. ఈరోజు మరో ముగ్గురు ఆసుపత్రి నుండి డిచ్ఛార్జ్ అయ్యారు.. మొత్తం 17 మంది కోలుకున్నారు..
  • అసలే జనం భయంతో బతికేస్తున్నారు. ఈ టైమ్‌లో కరోనాపై అవాకులు చవాకులు పేల్చేవాళ్లు ఎక్కువయ్యారు. కొందరు ఫేక్‌ న్యూస్‌ పోస్టు చేస్తుంటే కొందరు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై, వైద్యులపై ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మొత్తం రాష్ట్ర పరిస్థితిని ఆరా తీస్తున్నారు.
  • ఏలూరులో ఒక్కసారిగా ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు తెరమీదకు వచ్చాయి. ఇంకెన్ని ఉంటాయోనని ప్రజలు భయపడుతుంటే అలాంటి హై రిస్క్‌ జోన్‌లో నిరంతరం పని చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం సిటీలో 144 సెక్షన్‌ అమలవుతోంది. కుటుంబాలకు దూరంగా రెడ్‌జోన్‌లో పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.
  • ప్రతీది కరోనా కాదు.. పొడిదగ్గు తుమ్ములు ఉంటే వాయుకాలుష్యం. దగ్గు, తెమడ, ముక్కు కారడం, తుమ్ములు వస్తే జలుబు. దగ్గు, తెమడ, తుమ్ములు, ముక్కు కారడం, ఒంటి నొప్పులు, బలహీనత, తేలికపాటి జ్వరం ఫ్లూ లక్షణాలు. పొడిదగ్గు, తుమ్ములు, ఒంటి నొప్పులు, అధిక జ్వరం, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇవన్నీ కొవిడ్‌-19 లక్షణాలు. ప్రతీది కరోనా కాదు.. కంగారు పడొద్దు..
  • నిజాముద్దీన్ మర్కజ్ కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ నోటీసులు. తబ్లీఘీ-జమాత్ చీఫ్ మౌలానా సాద్ సహా 7గురు నిందితులకు నోటీసులు. నిబంధనలు ఎందుకు అతిక్రమించారో రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం. నిందితుల ఇళ్లకు నోటీసులు పంపించిన క్రైం బ్రాంచ్.

Bhainsa Violence: భైంసా బాధితులకు కిషన్‌రెడ్డి 3 నెలల జీతం..

Bhainsa Violence: Union Minister Kishan Reddy Visits Adilabad Bhainsa Victim Families, Bhainsa Violence: భైంసా బాధితులకు కిషన్‌రెడ్డి 3 నెలల జీతం..

Bhainsa Violence: భైంసా ఘటనలో అమాయకులు రోడ్డున పడ్డారని అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పోలీసులు అప్రమత్తంగా లేకపోవడంతోనే దాడులు జరిగాయన్నారు. భైంసాలో పర్యటించిన కేంద్ర మంత్రి బృందం.. బాధితులకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందలేదన్నారు. కోర్బా, కిషాన్‌గల్లిలో పర్యటించిన కిషన్‌రెడ్డి.. స్థానికులతో మాట్లాడారు. ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

భైంసా దాడుల్లో 101 మంది నష్టపోయినట్టు గుర్తించామన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. కేంద్రం తరపున నివేదిక సేకరించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నష్టపరిహారం ఇచ్చేలా చూస్తామన్నారు. తన మూడు నెలల జీతాన్ని బాధితులకు సాయంగా అందిస్తానన్న కిషన్‌రెడ్డి.. తమ ఎంపీల తరపున మరో 25 లక్షలను ఇస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కూడా ఆర్థిక సాయం అందేలా చూస్తామని హామి ఇచ్చారు.

గత నెలలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో.. భైంసాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్‌ విధించి.. శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా చూశారు. అల్లర్లకు కారణమైన వారిని గుర్తించి 17 మందిని అరెస్టుచేశామని పోలీసులు తెలిపినా.. రాజకీయంగా విమర్శలు ఆగలేదు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు భైంసాలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఆయన వెంట లక్ష్మణ్‌, ఎంపీలు అరవింద్‌, సంజయ్‌, సోయం ఉన్నారు.

Related Tags