కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు కన్నుమూత..

కేంద్ర మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు బేణీ ప్రసాద్‌ వర్మ కన్నుమూశారు. 79ఏళ్ల వ‌ర్మ‌..గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లక్నోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ...

కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు కన్నుమూత..
Follow us

|

Updated on: Mar 28, 2020 | 1:58 PM

కేంద్ర మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు బేణీ ప్రసాద్‌ వర్మ కన్నుమూశారు. 79ఏళ్ల వ‌ర్మ‌..గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లక్నోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 7 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్నీ ఆయన కుమారుడు రాకేశ్ వర్మ దృవీకరించారు. 1996-1998 మధ్య అప్పటి ప్రధాని హెచ్‌డి దేవేగౌడ మంత్రివర్గంలో టెలికాం మంత్రిగా వ‌ర్మ పనిచేశారు.. ఆ తరువాత కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ 2 హయాంలో ఉక్కు శాఖా మంత్రిగా పనిచేశారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వ‌ర్మ మృతిప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేశారు..పార్టీకి వ‌ర్మ చేసిన సేవలు ఎప్పటికి మరువలేనివి అని అన్నారు. కేంద్ర మంత్రిగా, ఎంపీగా తన బాధ్యతను సమర్ధవంతంగా నెరవేర్చారని కొనియాడారు. వర్మకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.