అక్టోబర్ 16 నుంచి 24 మధ్య బతుకమ్మ పండుగ : కవిత

తెలంగాణ పూల పండుగ బతుకమ్మ నవరాత్రి ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది బతుకమ్మ పండుగను అక్టోబర్ 16 నుండి 24వ‌ తేదీ వరకు జరుపుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచించారు.

అక్టోబర్ 16 నుంచి 24 మధ్య బతుకమ్మ పండుగ : కవిత
Follow us

|

Updated on: Sep 14, 2020 | 8:29 PM

తెలంగాణ పూల పండుగ బతుకమ్మ నవరాత్రి ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది బతుకమ్మ పండుగను అక్టోబర్ 16 నుండి 24వ‌ తేదీ వరకు జరుపుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచించారు. బతుకమ్మ పండుగ జరుపుకునే తేదీలపై ప్రముఖ సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులతో కూడిన ‘తెలంగాణ విద్వత్సభ’తో కవిత చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అధిక ఈశ్వీయుజ మాసం కారణంగా శ్రీ శార్వరి నామ సంవత్సరం లో వచ్చే బతుకమ్మ పండుగ తేదీలపై ఉన్న సందిగ్ధతకు తెర దించారు.

అధిక ఈశ్వీయుజ మాసం కారణంగా శ్రీ శార్వరి నామ సంవత్సరం లో వచ్చే బతుకమ్మ పండుగ తేదీలపై ఉన్న అస్పష్టతలను తొలగించేందుకు ‘తెలంగాణ విద్వత్సభ’ ప్రతినిధులతో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పండుగ తేదీలపై చర్చించారు. అంతకంటే ముందు ‘తెలంగాణ విద్వత్సభ’ ఆధ్వర్యంలోని 32 మంది సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులు , పండుగ తేదీలపై ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరంలాగ బాధ్రపద మాసంలో కాకుండా, అశ్వయుజ మాసంలో( అక్టోబర్) 16 వ తేదీన ఎంగిలి పూవ్వు బతుకమ్మను ప్రారంభించి, తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించాలన్నారు.

తెలంగాణ జాగృతి అనేక‌ సంవత్సరాల నుండి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నందున, చాలా మంది బతుకమ్మ తేదీల గురించి తనను సంప్రదిస్తున్న‌ట్లుగా కవిత తెలిపారు. దీంతో ‘తెలంగాణ విద్వత్సభ’ సలహా తీసుకున్న‌ట్లు చెప్పారు. ప్రతి 19 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి పరిస్థితి ఎదురౌతుందని, శాస్త్ర ప్రకారం ఇందులో ఎలాంటి తప్పు లేదని వేద పండితులు తెలిపారన్నారు. పండితులు, సిద్ధాంతుల సూచనల ప్రకారం అక్టోబర్ 16 న బతుకమ్మను ప్రారంభించాలని తెలంగాణ ఆడపడుచులను ఆమె ఈ సంద‌ర్భంగా కోరారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో