క్యాష్‌ డిపాజిట్లపై నో ఛార్జెస్: ఆర్‌బీఐ

Basic savings accounts in co-op banks should be made free says RBI, క్యాష్‌ డిపాజిట్లపై నో ఛార్జెస్: ఆర్‌బీఐ

బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది.  వారి ఖాతాలో నెలలో ఎన్ని సార్లు  డబ్బు జమ చేసినా ఎటువంటి నిబంధనలు విధించవద్దని ఆర్‌బీఐ బ్యాంకులకు వెల్లడించింది. బ్యాంకుల్లో కానీ, ఏటీఎంల వద్ద డిపాజిట్లపై ఎటువంటి ఛార్జీలు విధించకూడదని తేల్చి చెప్పింది.  ఈ ఖాతాలు సాధారణంగా పేద వర్గాలకు చెందిన వారివి ఎక్కువగా ఉండటంతో వారికి కనీసం సొమ్ము దాచుకునే అవకాశం ఇవ్వాలని పేర్కొంది.

ఈ ఖాతాదారులకు నెలకు కనీసం నాలుగు విత్‌డ్రాలకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. దీంతోపాటు వీరికి ఉచితంగా ఏటీఎం కార్డు, ఏటీఎం కమ్‌ డెబిట్‌ కార్డును ఎటువంటి ఛార్జీలు లేకుండా ఇవ్వాలని పేర్కొంది. ‘‘సాధారణ బ్యాంకు సేవలు మొత్తం బీఎస్‌బీడీ ఖాతాలకు అందేట్లు చూడాలి’’ అని ఆర్‌బీఐ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *