Weekly Horoscope: ఈ రాశివారు ఒకట్రెండు శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..

| Edited By: Ravi Kiran

Aug 27, 2023 | 5:00 AM

భవిష్యత్తులో ఉపయోగపడగల పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు కూడా వసూలు అవుతాయి.

Weekly Horoscope: ఈ రాశివారు ఒకట్రెండు శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..
Weekly Horoscope August 27
Follow us on

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ వారం గ్రహసంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. సమయాన్ని అన్ని విధాలుగానూ సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూడడం వల్ల ఉపయోగం ఉండదు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఆశించిన పురోగతి సాధిస్తారు. కొత్త ప్రాజె క్టులు లేదా లక్ష్యాలు అంది వస్తాయి. పిల్లల
చదువుల విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో బాగా రాబడి పెరుగుతుంది. కొత్త ఆలోచనలతో వృద్ధి చెందుతాయి. తోబుట్టు వులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయా నికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడే సూచనలున్నాయి. వృత్తి రంగంలో ఉన్నవారికి ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు కనిపిస్తాయి. దాయాదు లతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహకారముం టుంది. వ్యయ ప్రయాసలతో కొన్ని వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా
కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఇబ్బంది పెట్టే సూచనలు న్నాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఈ వారమంతా ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మరింత పురోగతికి అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి సంపాదనపరంగా సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటివి ఊపందుకుంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. తోబుట్టువులతో సమస్యలు తలెత్తే సూచన న్నాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి కూడా ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన తీపి కబురు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లోనూ, పుణ్య కార్యాల్లోనూ పాల్గొంటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

భవిష్యత్తులో ఉపయోగపడగల పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు కూడా వసూలు అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం ప్రారంభించినా విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. జీత భత్యాలు పెరిగే సూచనలున్నాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల
నుంచి ఆశించిన విధంగా అవకాశాలు రావచ్చు. కొత్త ఆలోచనలతో వృత్తి, వ్యాపారాలు ముందుకు దూసుకు వెడతాయి. సొంత పనుల విషయంలో బద్ధకించడం మంచిది కాదు. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లలకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగు
తాయి. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పితృవర్గం నుంచి ఆర్థిక ప్రయోజనాలు ఒనగూడే సూచనలున్నాయి. తండ్రితో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

దీర్ఘకాలిక వ్యక్తిగత సమ‍స్యల నుంచి చాలావరకు బయటపడతారు. గృహ, వాహన రుణాల భారాన్ని కూడా చాలావరకు తగ్గించుకునే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజ నాలు నెరవేరుతాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగి విశ్రాంతి కరువవుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆహార, విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం మీద కొద్దిగా
శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. భాగస్వాములు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధుమిత్రులతో వీలైనంత సహనంతో వ్యవహరించడం మంచిది. అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

బంధుమిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆశించిన దాని కంటే ఎక్కువగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఇతరులకు సహాయం అందించగలిగిన స్థితిలో ఉంటారు. ఉద్యోగరీత్యా చేసే ప్రయాణాలు లాభిస్తాయి. కొద్దిపాటి ఖర్చుతో వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. డాక్లర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు, ఇతర వృత్తి నిపుణుల వారికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. వివిధ రంగాలకు చెందిన ఉన్నతస్థాయి వ్యక్తులతో సన్నిహిత పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

నిరుద్యోగులకు అనుకోకుండా, అప్రయత్నంగా మంచి ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ఒక ప్రణాళిక ప్రకారం పని చేసి, ముఖ్యమైన వ్యవహారాలను, కార్యకలాపాలను పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహంగా, ఆశాజనకంగా ముందుకు ‍సాగుతారు. ఒక వ్యక్తిగత వ్యవహారంలో దూర ప్రాంతం నుంచి శుభవార్త అందుకుంటారు. ఉద్యోగంలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఆహార విహారాల్లోనూ, ప్రయాణాల్లోనూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ఉద్యోగం మారడానికి
ప్రయత్నాలు సాగించడానికి సమయం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో అనుకూలతలు పెరుగుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలపరంగా సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త ఉద్యోగాలు సంపాదించుకోవడంతో పాటు, ఉద్యోగం మార డానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే సూచన లున్నాయి. బాగా దగ్గర బంధువుల నుంచి, తోబుట్టువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో శుభవార్తలు వింటారు. బంధువుల మధ్యవర్తిత్వంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు స్నేహితుల సహాయంతో ముందుకు వెడతాయి. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధి కారులతో సామరస్యం పెరుగుతుంది. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతూ ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పిల్లలు చదువుల్లోనే కాకుండా పోటీ పరీక్షల్లో సైతం దూసుకు పోతారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు అప్రయత్నంగానే పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను, లక్ష్యాలను అందుకుంటారు. ఏ రంగానికి చెందిన ఉద్యోగులైనప్పటికీ వారికి కాలం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొద్దిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం, ఎవరికీ వాగ్దానాలు ఉండకపోవడం చాలావరకు శ్రేయస్కరం.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంటా బయటా బాధ్యతల ఒత్తిడి అధికంగా ఉంటుంది. మిమ్మల్ని ఉచితంగా ఉపయోగించుకునే వారి సంఖ్య పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు అదనపు లక్ష్యాలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి జీవితంలో క్షణం కూడా విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్క బెట్టాల్సి వస్తుంది. నిరుద్యోగులకు, అవివాహితులకు సమయం అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలను
తెలివితేటలతో, సమయ స్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. దైవకార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. గృహ, వాహన రుణాలకు సంబంధించిన ఒత్తిడి నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో వాదనలకు దిగకపోవడం శ్రేయస్కరం.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఏ విషయంలోనైనా స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధువుల నుంచి మీకు రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో అందుతుంది. ఆస్తికి సంబంధించిన వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి,
వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. పనిభారం, ఒత్తిడి వంటివి తగ్గుముఖం పడతాయి. అధికారుల ఆదరణతో హోదా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.