AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: పక్క ఇల్లు మన ఇంటికంటే ఎత్తుగా ఉంటే ధన నష్టమా…? పరిష్కారం మీ చేతిలోనే..

Vastu House Elevation: ప్రతి వ్యక్తిపై గ్రహచార ప్రభావం ఉంటుంది, ముఖ్యంగా చంద్ర గ్రహం మానసిక స్థితి, ఆరోగ్యం, ఆర్థిక అంశాలపై ప్రభావం చూపుతుంది. ఇంటి ఎత్తు తక్కువగా ఉండటం వంటి వాస్తు సమస్యలు కూడా మానసిక వేదన కలిగిస్తాయి. ఇటువంటి చంద్ర దోషాలు, గృహ దోషాలకు జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పరిష్కారాలను ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకుందాం.

Vastu Tips: పక్క ఇల్లు మన ఇంటికంటే ఎత్తుగా ఉంటే ధన నష్టమా...? పరిష్కారం మీ చేతిలోనే..
Building Vastu
Rajashekher G
|

Updated on: Mar 31, 2026 | 3:29 PM

Share

ప్రతి వ్యక్తి జీవితంలో గ్రహచార గతుల ప్రభావం పుట్టుకతోనే ప్రారంభమై జీవించినంతవరకు ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం వివరించింది. ఈ గ్రహ స్థితులు అనుకూలంగా లేనప్పుడు తగిన పరిహారాలు పాటించడం ద్వారా చక్కటి జీవితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. మానవుడి మేధస్సు, నాడీ మండలం, సమస్త మానసిక శక్తులపై చంద్ర గ్రహం అత్యంత విశేషమైన ప్రభావాన్ని చూపుతుంది. మనసు స్థిరంగా ఉండాలన్నా, అస్థిరంగా ఉండాలన్నా చంద్రుడే కారణభూతుడు. జాతకంలో చంద్రుడి స్థితి సరిగా లేనప్పుడు అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. వివాహితులకు, సంసారులకు నీలాపనిందలు కలుగుతాయి, జీవితం భారంగా అనిపిస్తుంది. చిన్నపిల్లలకు జలుబు, దగ్గు, ఆయాసం, మాల గ్రహ పీడలు వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కడుపునొప్పి, నాసికా సంబంధిత వ్యాధులు కూడా కలుగుతాయి. వ్యవసాయదారులు, ముఖ్యంగా పళ్ళ తోటలు, పూల తోటలు పండించేవారు, పశువులను పెంచేవారు నష్టాలను చవిచూస్తారు.

పాల ఉత్పత్తి కేంద్రాలు, పూల తోటల వ్యాపారాలకు చంద్రబలం చాలా అవసరం. చంద్రబలం తక్కువైనప్పుడు పాల కారే చెట్లు (అరటి, సపోటా, బొప్పాయి) కూడా నష్టాలను కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా జల సంబంధమైన రోగాలు, హిస్టీరియా, నరాల బలహీనత, భయాందోళనలు వంటివి అధికంగా ఉంటాయి.

వాస్తు దోష నివారణ

కొంతమంది ఇల్లు కట్టిన తర్వాత తమ పక్కన ఉన్న ఇల్లు ఎత్తుగా ఉండటం వల్ల లేదా ప్రభుత్వం రోడ్డును ఎత్తు చేయటం వల్ల తమ ఇల్లు పల్లంలోకి వెళ్లిందని ఆందోళన చెందుతుంటారు. దీని వల్ల మానసికంగా కుంగిపోతూ, తమకు ఏదైనా నష్టం జరుగుతుందేమోనని నిరంతరం ఆలోచిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇంటిని ఎత్తు పెంచుకోవడం చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునేవారికి సాధ్యం కాదు. దీనికి వాస్తు దోష నివారణ యంత్రం వంటి పరిష్కార మార్గాలు సూచించబడ్డాయి.

అదే ప్రధానం

ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గానీ, లోపలికి వచ్చేటప్పుడు గానీ ఇంటి యజమాని వంగకుండా, గడప తగలకుండా ఉండటం చాలా ముఖ్యం. రోడ్డు ఎత్తుగా మారినప్పుడు ఇంటి ప్రవేశం వద్ద ఒక మెట్టును ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. నువ్వు నడిచేటప్పుడు స్ట్రెయిట్‌గా నడుస్తున్నావా, వంగి నడుస్తున్నావా అన్నదే ప్రధానం.

ఉత్తమ పరిహారం

చంద్రబలం బాగాలేనప్పుడు చంద్ర గ్రహ దోష నివారణకు కొన్ని పరిహారాలు పాటించవచ్చు. చంద్రుడి అధిదేవత లక్ష్మీదేవి కాబట్టి శ్రీసూక్త పఠనం, శ్రీసూక్తాభిషేకం చేయడం శ్రేయస్కరం. చంద్రుడి అంతరిక్ష అధిదేవత భువనేశ్వరి దేవిని కూడా పూజించడం మంచిది. సోమవారం నాడు పాలచెట్టు వేరును పాలల్లో కలిపి చంద్రుడిని స్మరిస్తూ కట్టుకుంటే చంద్రగ్రహ దోషం పోతుంది. ఏదైనా నెలలో శుక్ల పక్షంలో వచ్చే మొదటి సోమవారం తెల్లని వస్త్రాలు ధరించి ఉపవాసం చేయడం వల్ల చంద్రగ్రహ దోషాల నుంచి బయటపడవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చంద్రకాంత మణి (మూన్ స్టోన్) ఉంగరాన్ని వెండిలో ధరించడం కూడా చంద్ర దోషాలకు ఒక ఉత్తమ పరిహారంగా చెప్పబడింది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Follow Us