Sun Eclipse 2023: ప్రతి సంవత్సరం ఏర్పడే గ్రహణాల ప్రభావం రాశి చక్రంలోని 12 రాశుల జాతకచక్రాలపై ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది అంటే 2023లో ఏర్పడనున్న 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాల ప్రభావం కూడా రాశిచక్రంలోని 12 రాశులపై వేర్వేరుగా ఉండనుంది. ఈ గ్రహణాలు కొన్ని రాశులకు అత్యంత శుభకరమైతే.. మరికొన్ని రాశులకు తీవ్ర నష్టాలను, బాధలను చేకూర్చనున్నాయి. ఈ క్రమంలోనే 2023లో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడనుంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల జీవితంలో లాభాలు, ప్రయోజనాలు పెద్ద ఎత్తున పెరగనున్నాయని అంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. ఇక ఈ సూర్య గ్రహణం ఏప్రిల్ 20న ఉదయం 7 గంటల 4 నిమిషాలకు ఏర్పడి.. మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాల వరకూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే.. ఈ గ్రహణం మన భారతదేశంలో కన్పించకపోయినా.. ఈ కింది రాశుల వారి జీవితంపై శుభప్రదంగా మారనుంది.
వృషభం: ఈ ఏడాది ఏప్రిల్ 20న ఏర్పడబోయే తొలి సూర్యగ్రహణం వృషభరాశి వారికి మేలు చేస్తుంది. మీరు కెరీర్లో అపారమైన ప్రయోజనాలు పొందుతారు. మీకు పెద్ద కంపెనీలో జాబ్ వచ్చే అవకాశం ఉంది. జీతంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. వ్యాపారానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
మిథునం: మిథునరాశివారిపై సూర్యగ్రహణం సానుకూల ప్రభావం చూపుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వీరి కెరీర్ అద్భుతంగా ఉంటుంది. వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు: ఈ సూర్యగ్రహణం ధనుస్సు రాశి వారికి కూడా ఎంతో అదృష్టమనే చెప్పాలి. మీరు ప్రారంభించిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ముఖ్యంగా మీ కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సూర్యగ్రహణ సమయం అద్భుతంగా ఉంటుంది. మొత్తానికి మీ జాతకంలో ఈ సమయం సూపర్‌గా ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..