Telugu News Astrology Sun transit in Vrischika Rashi : These zodiac signs to have negative impacts details in telugu
Astrology: వృశ్చిక రాశిలో రవి సంచారం.. ఆ రాశుల వారికి సమస్యలు.. జాగ్రత్త..!
ఈ నెల 17వ తేదీ నుంచి డిసెంబర్ 16 వరకూ రవి గ్రహం వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశులకు శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు అనుభవానికి రావడం జరుగుతుంది. రవి సంచారానికి సంబంధించిన దోషాలు తొలగిపోవాలన్న పక్షంలో ఈ గ్రహం వృశ్చిక రాశిలో ఉన్నన్ని రోజులు సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం చదువుకోవడం మంచిది.
ఈ నెల 17వ తేదీ నుంచి డిసెంబర్ 16 వరకూ రవి గ్రహం వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశులకు శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు అనుభవానికి రావడం జరుగుతుంది. మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశులకు కొన్ని మంచి ఫలితాలతో పాటు చెడు ఫలితాలు కూడా కలిగే అవకాశం ఉంది. రవి సంచారానికి సంబంధించిన దోషాలు తొలగిపోవాలన్న పక్షంలో ఈ గ్రహం వృశ్చిక రాశిలో ఉన్నన్ని రోజులు సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం చదువుకోవడం మంచిది.
మేషం: ఈ రాశికి అష్టమ స్థానంలో రవి సంచారం వల్ల అధికారం చేపట్టే అవకాశాలు వాయిదా పడే అవ కాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల విమర్శలకు గురి కావలసి వస్తుంది. ఆదాయం పెరిగే అవ కాశం ఉన్నప్పటికీ, కొందరు బంధువుల వల్ల ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆస్తి వివాదాల పరిష్కారంలో కొద్దిగా ఆటంకాలు, ఇబ్బందులు ఏర్పడతాయి. తండ్రి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ ఆగ్రహానికి గురవుతారు. ఇతరుల వివాదాల్లో తలదూర్చి ఇబ్బంది పడతారు.
మిథునం: ఈ రాశికి ఆరవ స్థానంలో రవి సంచారం వల్ల బంధువులతో, తండ్రితో అకారణ వైరాలు ఏర్పడ తాయి. ప్రభుత్వం వల్ల ధన నష్టం జరుగుతుంది. ఆహార, విహారాల్లో తేడాల వల్ల అనారోగ్యాలకు అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం ఆలస్యాలు చోటు చేసుకుంటాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంటుంది. రావలసిన డబ్బు ఒకపట్టాన చేతికి అందకపోవచ్చు. దాంపత్య జీవితంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి.
కన్య: ఈ రాశికి మూడవ స్థానంలో రవి సంచారం వల్ల అనవసర పరిచయాల మీదా, వ్యసనాల మీదా బాగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఆదాయపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా శ్రమాధిక్యత ఉంటుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశాభంగం కలుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు చివరి వరకూ వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు చికాకు పెడతాయి. కష్టార్జితం ఒకపట్టాన చేతికి అందక బాగా ఇబ్బంది పడతారు.
తుల: ఈ రాశికి ధన స్థానంలో రవి సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది కానీ, అన వసర ఖర్చులు, అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందకపోవచ్చు. ఆదాయ ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతాయి. కుటుంబంలో లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరగడం లేదా కుటుంబ సభ్యులు ఏ విధంగానూ సహకరించకపోవడం వంటివి జరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలకు అవకాశం ఉంది.
ధనుస్సు: ఈ రాశికి 12వ స్థానంలో రవి సంచారం వల్ల రాజపూజ్యాలు తగ్గి అవమానాలు పెరుగుతాయి. కష్టార్జితం బాగా వృథా అవుతుంది. సన్నిహితుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రయోజనం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విదేశీయాన ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ఒక పట్టాన పరిష్కారం కాక అవస్థలు పడతారు. ఆదాయానికి సంబంధించి ఎంత శ్రమపడ్డా ఫలితం తక్కువగా ఉంటుంది.
మీనం: ఈ రాశికి తొమ్మిదవ స్థానంలో రవి సంచారం వల్ల విదేశీయానానికి ఆటంకాలు పెరుగుతాయి. తండ్రి ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. విహార యాత్రలు, తీర్థ యాత్రలు వాయిదా పడతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలకు అవరోధాలు కలుగుతాయి. కొందరు బంధుమిత్రులు మిమ్మల్ని బాగా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం వల్ల అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. ప్రయాణాల్లో ధన నష్టం జరిగే అవకాశం ఉంది.