హిందూ మత గ్రంధాల ప్రకారం ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి అంకితం చేయబడింది. ఆదివారం సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా జీవితంలోని ఏర్పడిన సమస్యలనుంచి బయటపడతారని.. ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం. ప్రత్యక్ష దైవంగా భావించే సూర్యభగవానుడుని రోజూ పూజించి అర్ఘ్యం సమర్పించినా.. ఆయనకు అంకితం చేసిన ఆదివారం రోజు పూజించడం మరింత ఫలవంతమని విశ్వాసం. ఎవరి జీవితంలో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే.. ఆదివారం సాయంత్రం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే జీవితంలో సంపదకు ఎప్పుడూ కొరత ఉండదని విశ్వాసం. అంతేకాదు ఆదివారం సూర్యుడిని పూజించడం ద్వారా మానవునికి ఉన్న అన్ని రోగాలు కూడా దూరమవుతాయి. త్రేతాయుగం, సత్యయుగం, ద్వాపర, కలియుగంలో సూర్యుడు ప్రత్యక్ష దైవంగా పూజలను అందుకున్నాడని పురాణాల కథనం.
ఎవరైనా జీవితంలో ఆరోగ్యకరమైన శరీరం, సంపద, ఆనందం, శాంతిని కోరుకుంటే ఆదివారం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆదివారం తీసుకోవలసిన కొన్ని సాధారణ చర్యల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
ఆదివారం సాయంత్రం చేయాల్సిన పరిహారాలు
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).