Telugu News Astrology Moodami 2024: Guru moodami and shukra moodami these zodiac signs to have good results details in telugu
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు..
మే 2వ తేదీ నుంచి జూలై 7 వరకు శుక్ర మూఢమి, మే 5 నుంచి జూన్ 1 వరకూ గురు మూఢమి ఏర్పడుతున్నాయి. రవికి శుక్రుడు బాగా దగ్గరయినప్పుడు శుక్ర మూఢమి, రవికి గురువు బాగా దగ్గరగా ఉన్నప్పుడు గురు మూఢమి ఏర్పడతాయి. రవికి దగ్గరైన ఏ గ్రహమైనా బలహీన పడుతుంది. శుక్రుడు, గురువు వంటి ప్రధాన శుభ గ్రహాలు రవికి దగ్గరై బలహీనపడినప్పుడు శుభ కార్యాలు చేయడం మంచిది కాదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది.
మే 2వ తేదీ నుంచి జూలై 7 వరకు శుక్ర మూఢమి, మే 5 నుంచి జూన్ 1 వరకూ గురు మూఢమి ఏర్పడుతున్నాయి. రవికి శుక్రుడు బాగా దగ్గరయినప్పుడు శుక్ర మూఢమి, రవికి గురువు బాగా దగ్గరగా ఉన్నప్పుడు గురు మూఢమి ఏర్పడతాయి. రవికి దగ్గరైన ఏ గ్రహమైనా బలహీన పడుతుంది. శుక్రుడు, గురువు వంటి ప్రధాన శుభ గ్రహాలు రవికి దగ్గరై బలహీనపడినప్పుడు శుభ కార్యాలు చేయడం మంచిది కాదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అయితే, పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు మినహా కొన్ని రాశులకు విజయాలు, సాఫల్యాలతో కూడిన శుభ యోగాలు పట్టడం జరుగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులకు ఈ రెండు మూఢముల్లోనూ శుభ ఫలితాలే అనుభవానికి వస్తాయి.
మేషం: ఈ రాశివారికి ఈ రెండు మూఢాలూ చాలావరకు యోగదాయంగా ఉండబోతున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా బలం పుంజుకుంటాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. మొత్తం మీద ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన అవస రాలు తీరిపోతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ నిండుగా ఉంటుంది. ఇంట్లో సౌకర్యాలు పెరుగుతాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు.
వృషభం: ఈ రెండు మూఢాలూ ఇదే రాశిలో ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజయోగం పడుతుంది. ధన ధాన్య వృద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రాధాన్యం, ప్రాభవంతో పాటు డిమాండు కూడా పెరుగుతుంది. సమాజంలో గౌరవమర్యాదలు, పలుకుబడి పెరుగుతాయి. జూలై 7 వరకూ సమయం అనుకూలంగా ఉన్నందువల్ల ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. నిరుద్యోగులకు ఉత్తమ అవకాశాలు అంది వస్తాయి. అనారోగ్యం నుంచి విముక్తి లభిస్తుంది.
కర్కాటకం: ఈ రాశికి ఈ రెండు మూఢాల వల్ల అనేక విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యక్తిగతంగానూ, కుటుంబపరంగానూ కొన్ని సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అసాధారణ లాభాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతులు పొందే అవకాశముంటుంది. దాదాపు ప్రతి రోజూ ఏదో రూపేణా ఆదాయ వృద్ధి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో ఈ రెండు మూఢాలు ఏర్పడుతున్నందువల్ల, అనేక మార్గాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగ డంతో పాటు కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు, సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఒకటి రెండు శుభ వార్తలు కూడా అందుతాయి. వారసత్వ ఆస్తి సంక్రమిస్తుంది. ఆస్తి వివాదం, కోర్టు కేసు పరిష్కారం అవుతాయి.
వృశ్చికం: ఈ రాశికి జూలై 7 వరకు యోగప్రదమైన కాలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగు పడుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు, ఆర్థికంగా స్థిరత్వం కూడా లభిస్తుంది. భూ సంబంధమైన ఆస్తులు కొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసు కుంటాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
మకరం: ఈ రెండు మూఢాల వల్ల ఈ రాశుల వారికి లాభమే తప్ప నష్టమేమీ ఉండదు. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగ జీవితంలో పదోన్నతులు, భారీ జీతభత్యాలకు అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితాలనిస్తాయి. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటించడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. పిల్లలకు కూడా అదృష్ట యోగాలు పడతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.