Money Astrology: నాలుగు గ్రహాల అనుకూలత.. వీరికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!

ఈ ఏడాది చివరి నాటికి గ్రహాల సంచారంలో చోటు చేసుకునే మార్పులు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగడంతో పాటు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంతకీ ఆ అదృష్ట రాశులేవి? ఎలాంటి శుభ ఫలితాలు కలగనున్నాయి?

Money Astrology: నాలుగు గ్రహాల అనుకూలత.. వీరికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
Money Astrology 2026

Edited By:

Updated on: Nov 20, 2026 | 3:15 PM

ప్రస్తుతం సింహ రాశిలో సంచారం చేస్తున్న గురు, కుజులు, తులా రాశిలో సంచారం చేస్తున్న బుధ, శుక్రుల కారణంగా ఈ ఏడాది ముగిసే లోపు కొన్ని రాశుల వారికి ఆర్థిక కష్టనష్టాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ఈ నాలుగు గ్రహాల అనుకూలతతో ఆర్థిక సమస్యలే కాక, ఉద్యోగ, వ్యాపార సమస్యలకు కూడా పరిష్కారం లభించే అవకాశం ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఒత్తిళ్లు, వివాదాల నుంచి కూడా విముక్తి లభించే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తృతం అవుతాయి. ఈ రాశులవారి జీవితాల్లో కొన్ని సానుకూల మార్పులు కూడా చోటు చేసుకుంటాయి.

మేషం

ఈ రాశికి పంచమ స్థానంలో కుజ, గురువులు, సప్తమ స్థానంలో బుధ, శుక్రుల సంచారం వల్ల ధన యోగాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. ఈ రాశివారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా పూర్తిగా బయటపడతారు.

మిథునం

ఈ రాశికి తృతీయ స్థానంలో కుజ, గురువులు, పంచమ స్థానంలో శుక్ర, బుధులు సంచారం చేస్తు న్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభం కలగడంతో పాటు ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ది చెందడం వల్ల ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లలో బాగా లాభాలు కలగడం, రావలసిన డబ్బు చేతికి అందడం వల్ల ఊరట కలుగుతుంది. వ్యక్తిగత సమస్యలు, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

కర్కాటకం

ఈ రాశికి ధన స్థానంలో ఉన్న కుజ, గురువులు, చతుర్థ స్థానంలో శుక్ర, బుధులు యుతి చెంద డం వల్ల ఈ రాశివారికి ఆర్థికపరంగా అదృష్టాలు కలుగుతాయి. రెండు మూడు పర్యాయాలు ధన యోగాలు కలుగుతాయి. ఇంత వరకూ అనుభవిస్తూ వస్తున్న ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. ప్రతి ఆదాయ ప్రయత్నమూ అంచనాలకు మించి సత్ఫ లితాలనిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక వైపుల నుంచి ఆదాయం బాగా పెరుగుతుంది.

సింహం

ఈ రాశిలో కుజ, గురువులు, తృతీయ స్థానంలో శుక్ర, బుధులు సంచారం చేయడం వల్ల ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడం, ఆస్తిపాస్తుల విలువ పెరగడం, అద్దెల రూపంలో కూడా ఆదాయం వృద్ధి చెందడం, షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు, అవసరాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది.

తుల

ఈ రాశిలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి శుక్రుడు బుధుడితో యుతి చెందడం, లాభ స్థానంలో కుజ, గురువులు సంచారం చేయడం వల్ల ఈ రాశివారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి ఆర్థిక, వ్యక్తి గత సమస్యల నుంచి విముక్తి పొందుతారు. పొదుపులు, మదుపులు, పెట్టుబడుల ద్వారా ఆదాయాన్ని బాగా పెంచుకుంటారు. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. భూలాభం కలుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి లభిస్తుంది. రుణ సమస్యల నుంచి బయటపడతారు.

ధనుస్సు

రాశ్యధిపతి గురువు కుజుడితో కలిసి భాగ్య స్థానంలో ఉండడం, లాభస్థానంలో బుధ, శుక్రులు కలిసి సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభించడంతో పాటు ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం ఆదాయాన్ని పెంచుకోవడం వల్ల బ్యాంకు రుణాలు, గృహ రుణాలు వంటివి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

కుంభం

ఈ రాశికి సప్తమంలో కుజ, గురువులు, భాగ్య స్థానంలో శుక్ర, బుధుల సంచారం వల్ల ఈ రాశి వారికి అదృష్టం అనేక విధాలుగా తలుపు తట్టే అవకాశం ఉంది. ఏలిన్నాటి శని కారణంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టడం జరుగు తుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఏడాది ముగిసే లోగా ఆరోగ్య, కుటుంబ సమస్యలు, ఒత్తిళ్ల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us