Kuja Blessings: కుజ గ్రహ అనుగ్రహం.. వీరికి ఉద్యోగ, వ్యాపారాల్లో తిరుగే ఉండదు..!

Mars Transit 2026: సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12 వరకు కుజ గ్రహం కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కుజుడి ఈ సంచారం కొన్ని రాశులవారిలో ధైర్యం, సాహసం, రిస్క్ తీసుకునే స్వభావాన్ని పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులవారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని విజయం సాధించే అవకాశముంది.

Kuja Blessings: కుజ గ్రహ అనుగ్రహం.. వీరికి ఉద్యోగ, వ్యాపారాల్లో తిరుగే ఉండదు..!
Kuja Gochar 2026

Edited By:

Updated on: Sep 17, 2026 | 3:52 PM

సాహసాలకు, ధైర్యానికి, తెగువకు ప్రతీక అయిన కుజ గ్రహం తన ఉచ్ఛ, స్వక్షేత్ర, మిత్ర క్షేత్రాల్లో సంచారం చేస్తున్నప్పుడు తనకు అనుకూలమైన రాశులవారిని రిస్కు తీసుకునేలా, విజయాలు సాధించేలా చేస్తాడు. విపరీతమైన యాక్టివిటీ కలిగిన కుజుడు ఒక్క క్షణం కూడా తీరికగా ఉండనివ్వడు. ప్రస్తుతం తనకు నీచ స్థానమైన కర్కాటక రాశిలో ఈ నెల (సెప్టెంబర్) 18 నుంచి నవంబర్ 12 వరకు సంచారం చేస్తున్న కుజ గ్రహం కొన్ని రాశులను సాహసాలకు, రిస్కులకు ప్రోత్సహించే అవకాశం ఉంది. మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులవారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక ఆర్థికంగా కూడా సాహసాలకు ఒడిగట్టి విజయాలు సాధించే అవకాశం ఉంది.

మేష రాశి

రాశినాథుడైన కుజుడు చతుర్థ స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారి దృష్టి వ్యక్తిగత పురోగతితో పాటు, వ్యక్తిగత, ఆర్థిక సమస్యల పరిష్కారం మీద కేంద్రీకృతమవుతుంది. కొత్త ఆదాయ మార్గాలను చేపడతారు. ఆస్తి సమస్యల్ని రాజీమార్గంలో పరిష్కరించుకుంటారు. మరింత మంచి ఉద్యో గంలోకి మారడానికి, ఉన్నత పదవులు చేపట్టడానికి గట్టి కృషి చేస్తారు. జీవితం అభివృద్ది బాట పడుతుంది. కొన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలం అవుతారు.

కర్కాటక రాశి

ఈ రాశిలో కుజ గ్రహం వల్ల ఈ రాశివారిలో సాహసం చేయాలన్న కోరిక, రిస్కు తీసుకోవాలన్న ఉద్దేశం ప్రబలుతాయి. ఉద్యోగంలో సీనియర్లతో పోటీపడి ఉన్నత పదవులు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఉద్యోగం చేస్తూనే వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బును, బాకీలను రాబట్టుకుంటారు. విదేశీ ఉద్యోగాలు సంపాదిస్తారు.

ఇవి కూడా చదవండి

తులా రాశి

ఈ రాశికి దశమ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారు గట్టి పట్టుదలతో ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడం, శక్తి సామర్థ్యాలకు పదును పెట్టడం జరుగుతుంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. విదేశీయానానికి మార్గం సుగమవుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది.

వృశ్చిక రాశి

ఈ రాశికి భాగ్య స్థానంలో రాశ్యధిపతి కుజుడి ప్రవేశం వల్ల కొద్ది ప్రయత్నంతో తప్పకుండా ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. సంపన్నుడు కావాలన్న కోరిక చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు లభిస్తాయి. జీవనశైలిలో మార్పు వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి.

మకర రాశి

ఈ రాశివారికి సప్తమ స్థానంలో కుజ సంచారం వల్ల ఉద్యోగులు వ్యాపారాల్లోనూ, షేర్లు, స్పెక్యులే షన్లలోనూ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. ఆశించిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అపార ధన లాభం కలుగుతుంది. ఆస్తి వివాదాలు రాజీమార్గంలో పరిష్కారమవుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.

మీన రాశి

ఈ రాశికి పంచమ స్థానంలో కుజ సంచారం వల్ల గట్టి పట్టుదలతో కొన్ని సమస్యలు, వివాదాలను పరిష్కరించుకుని మనశ్శాంతి పొందుతారు. ముఖ్యంగా ఆస్తి వివాదాలు సానుకూలంగా పరి ష్కారం అవుతాయి. శత్రు, రోగ, రుణ బాధల నుంచి నివారణ లభిస్తుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. కొద్ది ప్రయత్నంతో నిరుద్యో గులు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో బాగా పరిచయాలు పెరుగుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us