మార్గదర్శక గ్రహాలతో శుభ యోగాలు.. వారు ఐశ్వర్యవంతులు కావడం పక్కా..!

ఈ ఏడాది మేషం, వృషభం, సింహం సహా మరికొన్ని రాశుల వారికి అనుకూలమైన కాలం. కుజుడు, శని, రవి, గురువు గ్రహాల అనుగ్రహం వీరికి లాభదాయకంగా ఉంటుంది. అవే లక్షణాలున్న గ్రహాల వల్ల ఈ రాశులు అత్యధికంగా లాభాలు పొందుతాయి. వృత్తి, వ్యాపారం, ఆర్థిక పురోగతి, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. తమ రాశి లక్షణాలకు అనుగుణంగా గ్రహాలు సహాయపడతాయి.

మార్గదర్శక గ్రహాలతో శుభ యోగాలు.. వారు ఐశ్వర్యవంతులు కావడం పక్కా..!
Lucky Zodiac Signs

Edited By: Janardhan Veluru

Updated on: May 01, 2025 | 7:21 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశులకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అవే లక్షణాలున్న గ్రహాల వల్ల ఈ రాశులు అత్యధికంగా లాభాలు పొందుతాయి. తమ లక్షణాలే కలిగి ఉన్న రాశులకు ఈ గ్రహాలు మార్గదర్శకంగా వ్యవహరిస్తాయి. ఉదాహరణకు, అత్యంత మొండితనం, పట్టు దల, దృఢ నిశ్చయం, ప్లానింగ్ కలిగి ఉన్న వృషభ రాశికి అవే లక్షణాలున్న శనీశ్వరుడు ఎంతగానో లాభాలు కలిగిస్తాడు. ఈ ఏడాది ఈ విధంగా లాభాలు పొందే రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, వృశ్చికం, మకరం. ఈ రాశులకు ఈ ఏడాది దారి చూపే గ్రహాలు కుజుడు, శని, రవి, గురువు.

  1. మేషం: సాహసానికి, ధైర్యానికి, తెగువకు, పట్టుదలకు మారుపేరైన ఈ రాశికి ఈ ఏడాదంతా కుజుడు బాగా సహాయం చేయబోతున్నాడు. కుజుడు ఈ రాశికి అధిపతి కూడా అయినందువల్ల ఈ రాశి వారు ఏ ప్రయత్నాన్నీ, ఏ అవకాశాన్నీ మధ్యలో వదిలిపెట్టే అవకాశం ఉండదు. ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడానికి, ఉద్యోగం సంపాదించుకోవడానికి, వృత్తి, వ్యాపారాలను అభివృద్ధి పరచుకోవడానికి కుజుడు బాగా సహాయం చేసే అవకాశం ఉంది. కుజుడి సహాయం ఇప్పటికే ప్రారంభమై పోయింది.
  2. వృషభం: ఈ రాశి వారికి ధన కాంక్ష ఎక్కువ. కుటుంబం మీద ఆపేక్ష మరీ ఎక్కువ. ప్రణాళికాబద్ధంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి, మదుపులు, పెట్టుబడులు పెట్టడానికి, వృత్తి, వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కించడానికి వీరు ఈ ఏడాది బాగా కృషి చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో వీరికి ఇవే లక్షణాలున్న శనీశ్వరుడు ఎంతగానో తోడ్పడబోతున్నాడు. శనీశ్వరుడు ఈ రాశికి ఈ ఏడాదంతా అనుకూలంగా ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో ఆర్థికాభివృద్ధి సాధ్యమయ్యే అవకాశం ఉంది.
  3. సింహం: సహజ నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడంతో పాటు, ధైర్య సాహసాలు ఎక్కువగా ఉండడం, సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యం ఉండడం వల్ల వీరు ఈ ఏడాది ఒక సంస్థకు సర్వాధికారి కావడానికి, ఉన్నత పదవులు అందుకోవడానికి గట్టి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఇటువంటి లక్షణాలే కలిగి ఉన్న గురువు వీరికి ఈ విషయంలో చేయూతనందించే అవకాశం ఉంది. గురువు అనుగ్రహం ఉన్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
  4. కన్య: విషయ పరిజ్ఞానం, ప్రణాళికా బద్ధమైన ప్రయత్నాలు, పట్టుదల, ఎంతటి శ్రమకైనా ఓర్చుకునే తత్వం కలిగిన ఈ రాశివారికి ఇటువంటి లక్షణాలే కలిగిన శనీశ్వరుడు బాగా తోడ్పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలను అభివృద్ధి చేయడం, వీలైతే విస్తరించడం, ఆదాయాన్ని పెంచుకోవడం వంటి విషయాల మీద దృష్టి పెట్టిన ఈ రాశివారు శనీశ్వరుడి క్రమశిక్షణ, పట్టుదల, నిబద్ధత వల్ల తప్పకుండా ఈ ఏడాది ఈ రాశివారి ఆశలు, లక్ష్యాలు, ఆశయాలను నెరవేర్చడం జరుగుతుంది.
  5. వృశ్చికం: ఓర్పు, సహనాలతో పాటు కార్యదీక్షకు, వ్యవహార దక్షతకు మారుపేరైన ఈ రాశివారిని ఇవే లక్షణాలు కలిగి ఉన్న రవి గ్రహం ఈ ఏడాది ఉచ్ఛ స్థితికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందాలన్న వీరి ఆశయం ఈ ఏడాది తప్పకుండా రవి వల్ల నెరవేరుతుంది. ఒక సంస్థకు అధిపతి కావాలన్న కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. ఆస్తి లాభం, సొంత ఇల్లు, సొంత వాహనం తదితర కలలను సాకారం చేసుకోవడానికి వీరు ఏ అవకాశాన్నీ చేజార్చుకోరు.
  6. మకరం: విపరీతమైన పట్టుదలకు, ఓర్పు, సహనాలకు, క్రమశిక్షణకు మారుపేరైన ఈ రాశివారికి ఈ ఏడాది సొంత ఇల్లు, ఆస్తిపాస్తులు, ఉద్యోగంలో గుర్తింపు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వంటి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఇవే లక్షణాలు కలిగిన రాశ్యధిపతి శనీశ్వరుడు ఇందుకు చేయూతనందిస్తాడు. ఈ రాశివారు శనీశ్వరుడి తోడ్పాటుతో తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. వీరి కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరుతాయి. శని అనుగ్రహంతో వీరు ఐశ్వర్యవంతులవుతారు.