Money Astrology: జూలైలో వారికి డబ్బే డబ్బు..! మీ రాశి ఉందేమో చూసుకోండి!

July 2026 Money Horoscope: జూలై నెలలో గురువు అనుకూలత కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేషం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఆదాయం పెరగడం, అదనపు సంపాదన అవకాశాలు లభించడం జరుగుతుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గి వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.

Money Astrology: జూలైలో వారికి డబ్బే డబ్బు..! మీ రాశి ఉందేమో చూసుకోండి!
July 2026 Money Horoscope

Edited By:

Updated on: Jun 26, 2026 | 4:33 PM

July 2026 Money Astrology: జూలై నెలంతా గురువు కర్కాటకంలో ఉచ్ఛ స్థితిలోనే కొనసాగడంతో పాటు, శనీశ్వరుడిని పూర్తిగా కంట్రోల్ లో పెట్టడం వల్ల కొన్ని రాశుల వారికి ఆదాయం పెరగడం, ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడడం, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. ధన కారకుడైన గురువు అనుకూలంగా ఉండే పక్షంలో ఆదాయం క్రమంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మేషం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఆదాయం వృద్ధి చెందడంతో పాటు అదనపు ఆదాయానికి కూడా అవకాశాలు పెరుగుతాయి.

  1. మేషం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో ఉచ్ఛస్థితిలో ఉన్నందువల్ల, ధనాధిపతి శుక్రుడు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారికి తక్కువ శ్రమతో ఎక్కువగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వచ్చే నెలంతా షేర్లు, స్పెక్యు లేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు ఉండే అవకాశం లేదు.
  2. మిథునం: ఈ రాశికి ధన స్థానంలో ధన కారకుడు గురువు ఉచ్ఛ పట్టడంతో పాటు, రాశ్యధిపతి బుధుడితో కూడా యుతి చెందడం వల్ల ఈ రాశివారికి జూలై 2 నుంచి విశేషమైన ధన యోగాలు పట్టే అవ కాశం ఉంది. అంచనాలకు మించిన ఆర్థిక లాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీత భత్యాలు ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు రెండింతలు పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి.
  3. కన్య: ఈ రాశికి లాభస్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు రాశ్యధిపతి బుధుడితో యుతి చెందడం వల్ల ఈ రాశివారికి షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థికపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందడంతో పాటు బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి.. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది.
  4. వృశ్చికం: ఈ రాశివారికి ధనాధిపతి అయిన గురువు భాగ్య స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం దినదినాభివృద్ది చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు అంచనాలకు మించి లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యానే కాక ప్రభుత్వ మూలకంగా కూడా ధన ప్రాప్తికి అవకాశం ఉంది. సామాన్యులు సైతం సంపన్నులు కావడం జరుగుతుంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. తప్పకుండా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
  5. ఇవి కూడా చదవండి
  6. మకరం: ఈ రాశికి ధనాధిపతి అయిన శని తృతీయ స్థానంలో కొనసాగడం, దాన్ని సప్తమంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న ధన కారకుడు గురువు వీక్షించడం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. బుధ, శుక్రులు కూడా అనుకూలం కావడం వల్ల వివిధ మార్గాల్లో అపార ధన లాభం కలుగుతుంది. జీతభత్యాలు, అదనపు ఆదాయం పెరగడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల, ఆస్తిపాస్తుల వల్ల బాగా లాభాలు కలిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి లభిస్తుంది.
  7. మీనం: ఈ రాశికి ధన, భాగ్యాధిపతి అయిన కుజుడు జూలై అంతా తృతీయ స్థానంలో సంచారం చేయడం, రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛస్థితిలో ఉండడం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి ధన లాభం కలుగుతుంది. ఆస్తిపాస్తుల ద్వారా కూడా సంపద పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

Also Read: జూలై నెలలో.. ఆ రాశుల వారికి కొత్త ఉద్యోగ యోగం ఖాయం..!

Loading...
Unable to load recommendations.
Follow Us