
శుభ కార్యాలకు కారకుడైన దేవ గురువు బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం ప్రారంభించడం వల్ల కొన్నిరాశులవారి జీవితాల్లో జూలై నెలలో పెళ్లి బాజాలు మోగే సూచనలు కనిపిస్తున్నాయి., గురువు ఈ రాశిలో అక్టోబర్ 31 వరకు సంచారం చేస్తున్నందువల్ల గురువు అనుకూలంగా ఉన్న రాశులవారికి పెళ్లి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరి ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీసే అవకాశం కూడా ఉంది. పెళ్లి ప్రయత్నాలకు జూలై నెల బాగా కలిసి వస్తుంది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు అక్టోబర్ నెలాఖరు లోపు ఒక ఇంటివారయ్యే అవకాశం ఉంది.
రాశ్యధిపతి కుజుడు కుటుంబ స్థానంలో, ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు సుఖ సంతోషాలకు సంబం ధించిన చతుర్థ స్థానంలో సంచారం వల్ల ఈ రాశివారు జూలైలో తప్పకుండా పెళ్లి సంబంధమైన శుభవార్త వినే అవకాశం ఉంది. సాధారణంగా ఇష్టపడిన బంధువుతోనో, ప్రేమించిన వ్యక్తితోనో వివాహం కుదిరే సూచనలున్నాయి.. జూలైలో పెళ్లి ప్రయత్నాలు చేయడం, మాట్లాడుకోవడం వంటివి చేయడం మంచిది. శ్రావణ, కార్తీక మాసాల్లో తప్పకుండా పెళ్లి కావడం జరుగుతుంది..
రాశ్యధిపతి బుధుడు ఆగస్టు చివరి వరకు కుటుంబ స్థానంలో సంచారం చేస్తుండడం, గురువు కుటుంబ స్థానంలోనే ఉచ్ఛ స్థితిలో ఉండడం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి జూలై, ఆగస్టు నెలల్లో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. వీరు ప్రేమ వివాహం చేసుకోవడం గానీ, మొదటి చూపులోనే నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం గానీ జరుగుతుంది.. కొద్ది ప్రయత్నంతో సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.. వైభవంగా, ఆడంబరంగా పెళ్లి జరిగే అవకాశం ఉంది.
శుభ కార్యాలకు కారకుడైన గురువు ఈ రాశిలో ఉచ్ఛస్థితిలో ఉండడం వల్ల, మరో నెల రోజుల పాటు కళత్ర కారకుడైన శుక్రుడు కుటుంబ స్థానంలోసంచారం చేస్తున్నందువల్ల జూలైలో ఈ రాశివారికి ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. జూలైలో చేసే పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సానుకూల ఫలితాలనిస్తాయి. వీరికి గురువు అనుకూలత ఫలి తంగా పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ జీవితం కూడా సక్సెస్ అవుతుంది.
ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉచ్ఛపట్టడంతో పాటు, రాశ్యధిపతి బుధుడు కూడా లాభ స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల జూలై నెల వీరికి పెళ్లి ప్రయత్నాలపరంగా బాగా కలిసి వస్తుంది. కొద్ది ప్రయత్నంతో ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. గురు, బుధ, శుక్రుల అనుకూలత వల్ల వీరికి ఆగస్టు ప్రాంతంలో వివాహం తప్పకుండా జరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో ఈ రాశివారు విదేశీ సంబంధాల మీద కూడా దృష్టి పెట్టడం చాలా మంచిది.
ఈ రాశికి భాగ్య స్థానంలో బుధ, గురు, శుక్రుల సంచారం వల్ల ఈ రాశివారి పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. జూలై మొదటి వారంలో ఈ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించే అవకాశం కూడా ఉంది. కార్తీక మాసంలో వీరికి పెళ్లయ్యే సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాలు కూడా పెళ్లికి దారితీస్తాయి. భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల విదేశీ సంబంధం కుదరడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైభవంగా పెళ్లి జరిగే అవకాశం ఉంది.
ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఈ రాశివారికి అతి తక్కువ ప్రయత్నంతో ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో తప్పకుండా పెళ్లి సంబంధం కుదురు తుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. శుక్రుడు కూడా బాగా అనుకూలంగా ఉండడం వల్ల ప్రేమ వివాహం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అతి తక్కువ ప్రయత్నంతో పరిచయ స్థుల్లో పెళ్లి సంబంధం కుదిరే సూచనలు కూడా ఉన్నాయి. పెళ్లి మీద భారీగా ఖర్చవుతుంది.
రాశ్యధిపతి, శుభకార్యాలకు కారకుడైన గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఈ రాశివారికి అతి తక్కువ ప్రయత్నంతో ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.. ప్రేమ వ్యవహారాలు కూడా విజయవంతం అవుతాయి. సాధారణంగా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో వివాహం అయ్యే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు జూలై నెల బాగా అనుకూలంగా ఉంది. కార్తీక మాసం లోపు వైభవంగా వివాహం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
Also Read: జూలై 2026 మాసఫలాలు: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు..