Telugu News Astrology Jupiter Transit 2026: These zodiac signs may get own house, vehicle and wealth luck
Jupiter Transit: గురు భగవానుడి కటాక్షం.. ఆ రాశులకు స్వగృహ, వాహన యోగం!
Guru Gochar 2026: జూన్ 2న గురుడు తన స్వక్షేత్రమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో కొన్ని రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయి. జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శుభప్రదమైన గ్రహంగా భావించే దేవగురువు బృహస్పతి ప్రభావంతో సంపద, సొంత ఇల్లు, కొత్త వాహనం, ఆర్థిక పురోగతి వంటి శుభ ఫలితాలు కలగనున్నాయి. ముఖ్యంగా వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఈ గురు సంచారం ఎంతో అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గురు గ్రహాన్ని ‘దేవగురువు బృహస్పతి’ అని కూడా పిలుస్తారు. జ్యోతిష్యశాస్త్రంలో గురు భగవానుడిని అత్యంత శుభప్రదమైన గ్రహంగా బావిస్తారు. సంపద, విద్య, వివాహం, సంతానం, ఆస్తులు, అదృష్టం, గౌరవం, వాహన సౌఖ్యాలకు గురు గ్రహమే కారకుడు. ఓ వ్యక్తి జాతకంలో గురుడు బలంగా ఉంటే అతని జీవితంలో పురోగతి, గౌరవం, సంపద సహజంగానే పెరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. జూన్ 2న గురుడు తన స్వక్షేత్రమైన కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి సొంత ఇల్లు, కొత్త వాహనం, ఆర్థిక పురోగతి వంటి అదృష్ట యోగాలు కలగనున్నాయి. ముఖ్యంగా వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఈ కాలం ఎంతో అనుకూలంగా మారనుంది.
వృషభ రాశి: ఈ రాశి వారికి చాలా కాలంగా ఉన్న సొంత ఇంటి కల త్వరలోనే నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్థలం కొనుగోలు, ఇల్లు నిర్మాణం లేదా పాత ఇంటి పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కొత్త కారు లేదా ద్విచక్ర వాహనం కొనుగోలు చేసే యోగం బలంగా కనిపిస్తోంది. ఆదాయం పెరిగి ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి గురుడి అనుగ్రహం ప్రత్యేక శుభ ఫలితాలను అందించనుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆస్తి, భూమి సంబంధిత వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. బ్యాంకు రుణాలు, ఫైనాన్స్ విషయాల్లో శుభవార్తలు వింటారు. కొత్త వాహనం కొనుగోలు చేసి కుటుంబంతో కలిసి సంతోషకరమైన ప్రయాణాలు చేసే అవకాశముంది.
కన్యా రాశి: ఈ రాశి వారికి ఉద్యోగం, వ్యాపారాల్లో ఆదాయం గణనీయంగా పెరిగే సూచనలు ఉన్నాయి. దీని వల్ల కొత్త ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే ఆలోచనలు నెరవేరే అవకాశముంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. కొత్త వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఇప్పటివరకు ఆలస్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి. గురుడి శుభ ప్రభావం వల్ల ఊహించని ధనలాభం కలిగే అవకాశముంది. ఆస్తులు పెరగడం, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడం వంటి శుభ యోగాలు ఏర్పడతాయి. కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు కనిపించవచ్చు.
మకర రాశి: ఈ రాశి వారికి గురుడి దృష్టి కొత్త అవకాశాల ద్వారాలను తెరుస్తుంది. కొత్త ఇంటికి మారడం, స్థిరాస్తి పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త ప్రదేశంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి ఆఫర్లు లభించవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఈ సమయంలో మీకు పెద్ద బలం అవుతుంది.
మీన రాశి: ఈ రాశి వారికి ఇది అత్యంత అదృష్టకరమైన కాలంగా మారనుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరే అవకాశం ఉంది. ఇల్లు, వాహనం, పొదుపు విషయంలో మంచి పురోగతి కనిపిస్తుంది. గురుడి అనుగ్రహంతో ధన ప్రవాహం పెరిగి జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. కొత్తగా ప్రారంభించే పనుల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది.
గురు భగవానుడి కటాక్షం లభించే ఈ సమయంలో సానుకూల ఆలోచనలతో ముందడుగు వేస్తే జీవితంలో గొప్ప మార్పులు చోటుచేసుకునే అవకాశముందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.