Telugu News Astrology July 2026 Horoscope: Job Opportunities and Positive Changes for These Zodiac Signs
Job Astrology: జూలై నెలలో.. ఆ రాశుల వారికి కొత్త ఉద్యోగ యోగం ఖాయం..!
July 2026 Job Horoscope: జూలై నెలలో ఉద్యోగ కారకుడైన శని అనుకూల స్థితిలోకి మారే అవకాశం ఉండటంతో కొన్ని రాశుల వారికి శుభ పరిణామాలు కనిపించనున్నాయి. మీన రాశిలో ఉన్న శనిపై గురువు దృష్టి పడడం వల్ల ఉద్యోగ సంబంధిత మంచి వార్తలు వినిపించే అవకాశం ఉంది. మేషం, వృషభం, మిథునం, కన్య, తుల, మకర రాశుల వారికి ఉద్యోగ జీవితంలో కొత్త అవకాశాలు, సానుకూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. వృత్తి, వ్యాపార రంగాల్లోని వారికి కూడా మెరుగైన స్థితికి చేరుతారు.
జూలై నెలలో కొన్ని రాశుల వారికి ఉద్యోగ కారకుడైన శనీశ్వరుడు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంది. మీన రాశిలో ఉన్న శనీశ్వరుడి మీద ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు దృష్టి పడడం వల్ల తప్పకుండా ఉద్యోగానికి సంబంధించిన శుభ వార్తలు వినడం, కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది.. మేషం, వృషభం, మిథునం, కన్య, తుల, మకర రాశుల వారికి ఉద్యోగ జీవితం ప్రారంభం కావడంతో పాటు ఉద్యోగంలో ఆశించిన సానుకూల మార్పులు సంభవిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కూడా గతం కంటే బాగా మెరుగైన స్థితికి చేరుకుంటాయి.
మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో ఉన్న దశమాధిపతి శనిని గురువుఉచ్ఛ స్థితి నుంచి వీక్షించడం వల్ల ఈ రాశివారు విదేశీ ఉద్యోగానికి సిద్ధంగా ఉండడం మంచిది. జూలై 2వ తేదీ నుంచి వీరికి ఉద్యోగపరంగా బాగా కలిసి రావడం, శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి మీద బదిలీలకు బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీ అవుతాయి.
వృషభం: ఈ రాశికి ఉద్యోగ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు లాభ స్థానంలో సంచారం చేయడం, ఆ శని మీద గురువు దృష్టి పడడం వల్ల ఈ రాశివారికి ఉద్యోగపరంగా తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.. ఉద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతి కలగడంతో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. పదోన్నతితో బదిలీ కావడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది.
మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో ఉద్యోగకారకుడైన శని సంచారం కొనసాగుతున్నందువల్ల నిరుద్యోగులకు జూలై 6 తర్వాత దూర ప్రాంతంలో తప్పకుండా ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది.. బుధుడి అనుకూలత కారణంగా నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.
కన్య: ఈ రాశికి దశమ స్థానంలో దశమ స్థానాధిపతి బుధుడు జూలై 7న ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.. నైపుణ్యాలు బాగా పెరుగుతాయి.. జీతభత్యాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. రాబడి అంచనాల్ని మించుతుంది.
తుల: ఈ రాశికి దశమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో కొనసాగుతున్నందువల్ల ఈ రాశివారికి జూలై మొదటి వారం నుంచి ఉద్యోగపరంగా కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అధికార యోగం పడుతుంది. విదేశీ ఆఫర్లు ఎక్కువగా అందుతాయి. నిరుద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు తమ నైపుణ్యాల్ని మెరుగుపరచుకుంటారు. ఒక సంస్థలో ఉన్నత పదవి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది.
మకరం: ఈ రాశికి అధిపతి, ఉద్యోగ కారకుడైన శనీశ్వరుడు తృతీయ స్థానంలో ఉండడం, ఆ శనిని ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు చూడడం వల్ల ఈ రాశివారికి ఉద్యోగ జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. జూలై ప్రారంభం నుంచి వీరి ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఉద్యోగంలో తప్పకుండా శీఘ్ర పురోగతి ఉండడంతో పాటు కొత్త అవకాశాలు అందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది.