Horoscope Today (19-05-2022): వృత్తి, వ్యాపార, ఉద్యోగ ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే.. ఈరోజు తమ జాతకం ఎలా ఉంటుంది.. అని ఆలోచిస్తారు. అంతేకాదు రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మే 19వ తేదీ )గురువారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారు ఈరోజు ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాల్సి ఉంటుంది
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు మానసిక ఆందోళనకు గురవుతారు. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు తగిన ఫలాన్ని ఇస్తాయి.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆర్ధికంగా శుభఫలితాలు పొందుతారు. అన్ని రంగాల వారికీ ప్రోత్సాహంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. భవిష్యత్ కు తగిన ప్రణాళికలు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు కీలక వ్యవహారంలో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా పనులు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. చిత్తశుద్ధితో చేపట్టిన పనులను పూర్తిచేస్తారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మానసికంగా ఆనందాన్ని పొందుతారు. చేపట్టిన పనులను శ్రద్ధతో పూర్తి చేయాల్సి ఉంటుంది.
తుల రాశి: ఈ రోజు ఈ రాశి వారు బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. శుభ వార్తలు వింటారు. మానసికంగా ధృడంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ముందగువేస్తారు.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ఆత్మీయులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్ధికంగా మేలైన ఫలితాలను అందుకుంటారు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు శుభ వార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ధైర్యంతో చేపట్టిన పనుల విషయంలో ముందడుగు వేస్తారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు కీలక నిర్ణయాల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు ప్రతిభకు తగిన గుర్తింపు సొంతం చేసుకుంటారు. ఆర్ధికంగా శుభఫలితాలు అందుకుంటారు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉత్సాహంగా పనిచేసి ప్రారంభించిన పనులను పూర్తిచేస్తారు. కలహాలకు దూరంగా ఉండడం మేలు.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన ఆలోచనలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. స్దాన చలన సూచనలు ఉన్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)