Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త..! 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు

| Edited By: Ravi Kiran

Jun 01, 2024 | 7:26 AM

దిన ఫలాలు (మే 31, 2024): మేష రాశి వారు ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది జాగ్రత్త. వృషభ రాశి వారు వ్యాపారాల్లో కొత్త మార్గాలు అనుసరించి లాభాలు అందుకుంటారు. మిథున రాశి వారికి కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త..! 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు
Horoscope Today 31st May 2024
Follow us on

దిన ఫలాలు (మే 31, 2024): మేష రాశి వారు ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది జాగ్రత్త. వృషభ రాశి వారు వ్యాపారాల్లో కొత్త మార్గాలు అనుసరించి లాభాలు అందుకుంటారు. మిథున రాశి వారికి కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆదాయంతో ఖర్చులు పోటీ పడతాయి. కొందరు దగ్గర బంధువులతో ఆస్తి వివాదం కలుగుతుంది. ఉద్యోగంలో పని భారం వల్ల ఒత్తిడి ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలకు, జీవిత భాగస్వామికి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వ్యాపారాల్లో కొత్త మార్గాలు అనుసరించి లాభాలు అందుకుంటారు. విదేశాల్లో స్థిరపడిన మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలతో విశేషంగా రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంది. పరిచయస్థుల ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఎవరినీ అతిగా నమ్మకపోవడం చాలా మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

చేపట్టిన వ్యవహారాల్లో అప్రయత్నంగా విజయాలు సాధిస్తారు. ఆస్తి వివాదాల్లో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో శుభ కార్యంలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారులకు అనుకూలతలు పెరుగుతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కుటుంబ సభ్యుల నుంచి ధనపరంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపో తాయి. సోదరులతో వివాదాలు, విభేదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఊపందు కుంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి కాస్తంత ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన సమాధానం లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఏ ప్రయత్నం తలపెట్టినా వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలి స్తాయి. పిల్లలకు పరీక్షా ఫలితాలు ఉత్సాహం కలిగిస్తాయి. కొత్త ఉద్యోగ, విద్యావకాశాలు లభి స్తాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

కుటుంబ సభ్యులతో పుణ్య క్షేత్రాన్ని సందర్శిస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో అవరోధాలు, ఆటం కాలు తొలగిపోతాయి. పాత మిత్రులను కలుసుకోవడం ఆనందాన్నిస్తుంది. ఉద్యోగంలో మీ పని తీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక అవసరాల నుంచి బయటపడతారు. స్వల్ప అనారోగ్యానికి అవకావం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ముఖ్యమైన వ్యవహారాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి సలహాలు తీసు కుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల సమాధానం అందు తుంది. ఆస్తి వివాదంలో సానుకూల వార్త అందే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. చేపట్టిన పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. ధన సంబంధమైన విషయాల్లో తొందరపడి ఎవరికీ మాట ఇవ్వవద్దు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప సమస్యలు ఇబ్బందులు కలిగి స్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగంలో ఇతరుల బాధ్యతలను పంచు కోవాల్సి వస్తుంది. ఆదాయం, ఆరోగ్యం పరవాలేదనిపిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయానికి మించిన ఖర్చులుండే అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రులతో అకారణ విభే దాలు తలెత్తవచ్చు. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఇతరుల మాటలను విని ఆవేశపడడం మంచిది కాదు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందే సూచనలున్నాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా కొనసాగుతాయి. ఆరోగ్యానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

బంధుమిత్రులతో రోజంతా సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ అనుకూలంగా సాగుతాయి. వాహన యోగం పడుతుంది. భూ లాభం కలిగి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు ప్రవేశ పెట్టి లాభాలు పొందుతారు. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభి స్తుంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

కుటుంబ జీవితంలో సమస్యలు సమసిపోయి, సామరస్యం పెరుగుతుంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఉపయోగం ఉంటుంది. ఆహార, విహా రాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

స్థిరాస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధి స్తారు. దైవ కార్యాల మీద డబ్బు ఖర్చు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇరుగు పొరుగు నుంచి కొద్దిగా సమస్యలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాల్లో సమస్యలు సర్దుమణుగు తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందే అవకాశం ఉంది.