Horoscope Today: ఈ రాశివారు ఈరోజు అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.!

Horoscope Today: ఏ రాశివారికి ప్రయోజనాలు లభిస్తాయి.? ఎవరు శుభవార్త పొందుతారు.? ఈ రోజు మీరు చేపట్టే పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా..

Horoscope Today: ఈ రాశివారు ఈరోజు అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.!

Updated on: Mar 29, 2021 | 7:52 AM

Horoscope Today: ఏ రాశివారికి ప్రయోజనాలు లభిస్తాయి.? ఎవరు శుభవార్త పొందుతారు.? ఈ రోజు మీరు చేపట్టే పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయా.? రాశిఫలాలు ఆధారంగా ఈరోజు ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం..

మేషం:

చేపట్టిన కార్యక్రమాల్లో సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారులకు లాభాలు, భాగస్వాముల నుండి సహకారం లభిస్తుంది. దైవ దర్శనం మేలును చేకూరుస్తుంది.

వృషభం:

స్నేహితుల నుంచి సహాయసహకారాలు, చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. కానీ జాగ్రత్త అవసరం. ధనలాభం, వ్యాపారం పుంజుకుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.

మిథునం:

ఈ రోజు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు, వ్యాపార, ఉద్యోగాల్లో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు.

కర్కాటకం:

కుటుంబ మద్దతు, శారీరక శ్రమ, వ్యాపారాల్లో కొద్దిపాటి సమస్యలు, ఆలయాలు సందర్శిస్తారు.

సింహం:

ఈ రాశివారికి ఈరోజు అంతా మంచి జరుగుతుంది. వ్యాపారాల్లో మెరుగైన ఫలితాలు, పనులు ఊపందుకుంటాయి. లాభ అవకాశాలు వస్తాయి. అన్నింటిలోనూ జాగ్రత్త తప్పనిసరి, దైవ దర్శనం మేలు చేస్తుంది.

కన్య:

కొత్త వ్యాపార ఒప్పందాలు జరుగుతాయి. ఆశించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు విజయం లభిస్తుంది.

తుల:

ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, అనుకోని ఖర్చులు, యువతకు విజయం లభిస్తుంది, దైవ దర్శనాలు మేలు చేస్తాయి

వృశ్చికం:

ఈ రోజు ఈ రాశివారికి చాలా మంచి రోజు. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగాల్లో అనుకూలత, లాభం పెరుగుతుంది.

ధనుస్సు:

అనుకోని ఖర్చులు, ముఖ్యుల నుంచి కీలక సమాచారం పొందుతారు, కుటుంబంలో సంతోషం, ఆకస్మిక ప్రయాణాలు, జీవిత భాగస్వామితో అనుకూలత ఉంటుంది.

మకరం:

కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది, ఆర్ధిక ఇబ్బందులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు

కుంభం:

విలువైన వస్తువులను భద్రంగా ఉంచండి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మానసిక శాంతి లభిస్తుంది. ఆలోచనలు కలిసి వస్తాయి.

మీనం:

ఆరోగ్య సమస్యలు, లాభ అవకాశాలు వస్తాయి. ప్రత్యర్థులను ఓడిస్తారు, వ్యాపారాలలో లాభాలు, ఆకస్మిక ప్రయాణాలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Also Read:

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఆ రెండు పథకాల రిజిస్ట్రేషన్లకు రేపే లాస్ట్ డేట్.. త్వరపడండి.!

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!

Loading...
Unable to load recommendations.
Follow Us