Horoscope Today: ఆ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.. 12 రాశులవారి గురువారం రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 27, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగ జీవితంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.. 12 రాశులవారి గురువారం రాశిఫలాలు
Horoscope Today 27th June 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 27, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జూన్ 27, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగ జీవితంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేపడతారు. ఉద్యోగ జీవితంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు, నిరు ద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలసి వస్త్రాభర ణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా, లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు, ఉద్యోగ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం కూడా చాలావరకు సామరస్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది..

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటుంది. ఆదాయం బాగా పెరగడంతో పాటు, రావలసిన సొమ్ము కూడా చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు బాగా ఎక్కువగానే ఉన్నప్పటికీ వాటిని సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. దగ్గర బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. ఇంటా బయటా మాటకు విలువ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇంటా బయటా అను కూలతలుంటాయి. వ్యక్తిగత సమస్యలు ఒత్తిడి కలిగిస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి ఆఫర్ వచ్చే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశముంది. అదనపు ఆదాయ మార్గాల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. కుటుంబం పరిస్థితి ఉత్సాహం కలిగిస్తుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త లక్ష్యాలను చేపట్టడం జరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఇంటా బయటా శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలుంటాయి. వ్యాపార కార్యకలాపాలు చురుకుగా సాగుతాయి. లాభాలు పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. సొంత పనుల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి కంపెనీల ఆఫర్లు అందే అవకాశం ఉంది. అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆదాయ మార్గాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధి స్తారు. ఉద్యోగంలో ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. మొండి బాకీలను వసూలు చేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆస్తి సమస్య చాలావరకు పరిష్కారం అవుతుంది. విలువైన ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెడతారు. జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాల్ని సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఉద్యో గంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా అనుకూలంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రాద నుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. జీవిత భాగ స్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతి ఫలం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కుటుంబ జీవితం అన్యోన్యంగా సాగిపో తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక సంబంధమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు నమ్మకం పెరుగుతుంది. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు అనుకోకుండా మంచి ఉద్యోగం లభిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరులు తమ స్వార్థానికి ఎక్కువగా ఉపయోగించు కునే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల్ని పనితీరుతో ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవు తాయి. బంధువుల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రోజంతా సానుకూలంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవు తుంది. కొద్ది శ్రమతో ప్రతి వ్యవహారమూ విజయవంతంగా పూర్తవుతుంది. కుటుంబపరంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపో తాయి. ఉద్యోగం జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.

Latest Articles
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?