Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Mar 20, 2024 | 5:01 AM

దిన ఫలాలు (మార్చి 20, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృషభ రాశి వారికి దీర్ఘకాలిక రుణాల నుంచి కాస్తంత ఉపశమనం లభిస్తుంది. మిథున రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు..

Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగంలో  హోదా పెరుగుతుంది.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు
Horoscope Today 20th March 2024
Follow us on

దిన ఫలాలు (మార్చి 20, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృషభ రాశి వారికి దీర్ఘకాలిక రుణాల నుంచి కాస్తంత ఉపశమనం లభిస్తుంది. మిథున రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ వాతావరణం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు అందుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పకపోవచ్చు. దీర్ఘకాలిక రుణాల నుంచి కాస్తంత ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహం కలిగిస్తుంది. బంధువుల నుంచి మీరు ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రతలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొందరు బంధువులతో శుభకార్యంలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగే అవకాశముంది. మీరు ఎదుర్కొంటున్న ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

చేపట్టిన పనుల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలు కలు గుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. స్వల్ప అనా రోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవ హారాల్లో శ్రమ, తిప్పట ఉండవచ్చు. మీ నుంచి ఆర్థిక సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఇష్టమైన బంధు మిత్రులతో విందులో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడ తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రోజంతా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుని సరదాగా గడుపుతారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పెళ్లి ప్రయ త్నం విషయంలో బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. ఉద్యోగుల ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు పెరు గుతాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

జీవిత భాగస్వామితో ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తారు. కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. ఇంట్లో సంతోషదాయక వాతావరణం నెలకొంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ వాతావరణం చాలావరకు ప్రశాం తంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ముఖ్యమైన ప్రయత్నాలు తేలికగా నెరవేరుతాయి. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సరదాగా గడుపుతారు. ఒకటి రెండు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా అను కూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అందుతాయి. పిల్లలకు సంబంధించి శుభ వార్త వింటారు. కుటుంబంతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇతరులకు సహాయంగా ఉంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా బాగా అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరు గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగు తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచ యాలు ఏర్పడుతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో బాగా ఎంజాయ్ చేస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా గడుపుతారు. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే అప్రయత్నంగా మంచి ఉద్యోగం లభించే అవకాశముంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. వాహన యోగం ఉంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టమైన వ్యక్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలి తాలనిస్తాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరి ష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొం టారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. కొన్ని మార్పులు, చేర్పులతో సత్ఫలితాలు సాధి స్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో సమస్యలు, ఇబ్బందులు తొలగిపోయి, అధికారుల ఆదరణ పెరుగుతుంది. మొత్తం మీద అనుకున్న పనులు అనుకు న్నట్టు జరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.