Horoscope Today: రాశి ఫలాల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే వారు మనలో చాలా మంది ఉంటారు. రాశి ఫలాల (Rashi Phalalu) ఉండే విశ్వాసం అలాంటిది. ఇందులో భాగంగానే తమ భవిష్యత్తును అంచనా వేసుకుంటే, కొత్త పనులను ప్రారంభిస్తుంటారు. మరి శనివారం మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసేయండి..
ఈ రాశుల వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో లాభాలు కలిగే అవకాశం కనిపిస్తున్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. చూసిన కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తుంటాయి. వీలైనంత వరకు శాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఈ రాశుల వారు సాయి బాబా దర్శనం చేసుకుంటే మేలు జరుగుతుంది.
వృషభ రాశుల వారికి అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉన్నత అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్వహరించండి. నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే మంచిది.
ఈ రాశుల వారు తమ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో వారిని తక్కువ అంచనా వేయకండి. మీ అవసరాలను తీర్చడానికి సమయానికి ముందుకొస్తారు.
కర్కాటక రాశుల వారికి ఈ రోజు కాస్త వ్యతిరేకతే కనిపిస్తోంది. పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. శారీరక శ్రమ కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి.
ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అంతే మంచే జరుగుతుంది.
కన్య రాశి వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. బంధువుల సహకారం లభిస్తుంది. ముఖ్యమైన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆశించిన ఫలితాలు అందే అవకాశం ఉంది.
ఈ రాశి వారు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. వాదులాటకు దిగకపోవడమే మంచిది. శారీరక శ్రమ పెరుగుతుంది. దైవారాధన మర్చిపోకూడదు.
వృశ్చిక రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు. పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఇతరులను కలుపుకొని పనులను పూర్తి చేస్తారు.
ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చేపట్టే పనుల్లో శ్రమ ఫలిస్తుంది.
మకర రాశి వారికి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఈ రాశి వారు అనుకున్న పనులు సాధిస్తారు. గొడవలకు దూరంగా ఉండడం సూచించదగ్గ అంశం. మంచి నిర్ణయాలతో అభివృద్ధి సాకారం అవుతుంది.
మీన రాశి వారు ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చంచల స్వభావంతో నిర్ణయాలు తీసుకోకండి, ఆలోచించి ముందడుగు వేయాలి. శ్రమతో కూడిన ఫలితాలు గోచరిస్తున్నాయి.
Note: రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.
Also Read: Sri Lanka Crisis: శ్రీలంకలో తెలుగువారి అవస్థలు.. దినదిన గండంగా మారిన బతుకుదెరువు