ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యక్తిగత సమస్య ఒకటి స్నేహితుల సహాయంతో పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులకు ఆర్థికంగా సహాయ పడతారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. వ్యాపారులకు బావుంది.
చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో బాగా శ్రమ ఉన్నా, లక్ష్యాలు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆదాయానికి లోటుండదు. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎవరికీ ఎక్కడా హామీలు ఉండవద్దు.
ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయానికి లోటు ఉండదు కానీ, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాదనుకున్న డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వైద్యపరమైన ఖర్చులు చికాకు కలిగిస్తాయి. వ్యాపారంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మంచి ఆఫర్ వస్తుంది.
ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొత్త సేవలో నిమగ్నం అవుతారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు. పెళ్లి సంబంధం కుదురుతుంది. పెద్దల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి.
ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అంది అవసరాలు తీరుతాయి. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
వ్యాపారులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. అదనపు ఆదాయానికి
ప్రయత్నాలు చేస్తారు.
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు సహాయం చేస్తారు. ఒక ముఖ్యమైన ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. పెళ్లి సంబంధం కుదరవచ్చు.
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇంకా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాలు పరవాలేదు. కుటుంబ వాతావరణం బాగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు సంపాదిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. డబ్బు జాగ్రత్త.
ఉద్యోగం మారాలని ప్రయత్నాలు చేస్తారు. ఆదాయం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉన్న ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పెళ్లి సంబంధం వెనక్కి పోతుంది.
ఉద్యోగంలో అధికార లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక స్తోమత బాగా మెరుగుపడుతుంది. సమాజానికి మేలు కలిగే పనులు చేపడతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కొద్దిగా రుణ బాధ తగ్గుతుంది. సొంత నిర్ణయాల వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది.
ఉద్యోగ వాతావరణం బాగానే ఉంటుంది. ఆదాయంలో కొద్దిగా పెరుగుదల ఉండవచ్చు. వ్యాపారం చాలావరకు నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. స్పెక్యులేషన్ పరవాలేదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఆశించిన స్థాయిలో ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. తలపెట్టిన పనులు శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం
నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి
వ్యాపారాలకు అనుకూల సమయం.
ఉద్యోగ జీవితం పరవాలేదు. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబ సమస్య ఒకటి
సామరస్యంగా పరిష్కారం అవుతుంది. స్నేహితులు చేదోడు వాదోడుగా ఉంటారు. దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..