జూన్ 23 రాశిఫలాలు: ఈ రోజు అదృష్టం ఏయే రాశుల వారిని వరించనుంది?

Horoscope Today (June 23, 2026): మంగళవారం గ్రహాల అనుకూల ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, ఆర్థిక లాభాలు, కుటుంబ సహకారం లభించే సూచనలు ఉన్నాయి. మరికొన్ని రాశుల వారు కీలక నిర్ణయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.

జూన్ 23 రాశిఫలాలు: ఈ రోజు అదృష్టం ఏయే రాశుల వారిని వరించనుంది?
Horoscope Today 23 June 2026

Edited By:

Updated on: Jun 23, 2026 | 6:00 AM

దిన ఫలాలు (జూన్ 23, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. అయితే, అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారు జీవిత భాగస్వామి తోడ్పాటుతో ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఆదాయ ప్రయత్నాలు మరింత పుంజుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ప్రయాణాలు వల్ల ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. స్థిరాస్తికి సంబంధించిన అమ్మకాలు, కొను గోళ్లలో అంచనాలకు మించిన లాభాలు పొందుతారు. వాహన యోగానికి అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధికి అనుకూల వాతావరణం ఉంది. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ పరంగా ఒకటి రెండు ఆశలు నెరవేరే సూచనలున్నాయి. నిరుద్యోగులు మంచిశుభవార్త వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. అయితే, అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం శ్రేయస్కరం. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తవచ్చు. ముఖ్య మైన పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యక్తిగత సమస్యల్ని జాగ్రత్తగా చక్కబెట్టడం జరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

జీవిత భాగస్వామి తోడ్పాటుతో ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఆదాయ ప్రయత్నాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు బాగా పురోగతి చెందుతాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. మీ వల్ల బంధుమిత్రులు కొందరు లబ్ధి పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మీద, ముఖ్యంగా జీవిత భాగస్వామి మీద కాస్తంత ఎక్కువగా ఖర్చు చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో ఆశించిన శుభవార్త అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడిపరంగా పైచేయి సాధిస్తారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల చదువులు, ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ముఖ్యమైన లావాదేవీలు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త కార్యక్రమాలు చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఎదురుండదు. దాంపత్యం హ్యాపీగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేరతాయి. అధికార వర్గాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. స్వల్ప ధన లాభ సూచనలున్నాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. కొందరు బంధువులు, సన్నిహితులతో ఏర్పడ్డ వివాదాలు సమసిపోయే అవకాశం ఉంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పిల్లల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పరవాలేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. మిత్రుల వల్ల కొద్దిగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు కూడా నిలకడగా పురోగమిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో కొద్దిపాటి సమస్యలు, చికాకులు తప్పక పోవచ్చు. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొందరు మిత్రులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు కొంత మేరకు సఫలం అవుతాయి. కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. తలపెట్టిన పనుల్లో శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ, నిదానంగా వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు తప్పకుండా సానుకూల సమాచారం అందుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

వృత్తి, ఉద్యోగాలు ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోతాయి. వ్యాపారాల్లో కూడా సంపాదన బాగా నిలకడగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు కొంత మేరకు సఫలం అవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కుటుంబపరంగా అదనపు బాధ్యతలు మీద పడతాయి. కొత్త ఉద్యోగం విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు సజావుగానే సాగిపోతాయి. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా కొద్దిపాటి చికాకులు ఉండవచ్చు. బంధువుల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రస్తుతానికి కొత్త ప్రయత్నాలు చేపట్టకపోవడం మంచిది. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం కూడా పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. పిల్లల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన సంస్థల నుంచి సానుకూలస్పందన లభిస్తుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది.

Follow Us