
దినఫలాలు (జూన్ 22, 2026): మేష రాశి వారు ఈ రోజు చేసే ఆర్థిక ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒక మెట్టు పైకెక్కే అవకాశం ఉంటుంది. మిథున రాశికి చెందిన వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో భారీగా మార్పులు చేపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. తృతీయ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల అన్ని రంగాల్లోనూ పురోగతి ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల లాభం ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పెట్టిన పెట్టుబడులకు అంచనాలకు మించిన ప్రతిఫలం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.
ఈ రాశివారికి రోజంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒక మెట్టు పైకెక్కే అవకాశం ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఆర్థిక పరిస్థితికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. బరువు బాధ్యతలకు సంబంధించిన ఒత్తిడి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది.
అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో భారీగా మార్పులు చేపడతారు. రాబడికి లోటుండదు. ఉద్యోగపరంగా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగాల్లో ఉన్నవారు వ్యాపారాల్లో ప్రవేశించే సూచనలున్నాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికీ గుడ్డిగా నమ్మవద్దు.
వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులకు బాగా ఉపయోగపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. స్థిరాస్తి వివాదం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
రోజంతా కష్ట సుఖాలు మిశ్రమంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగి, అదనపు బాధ్యతలు మీద పడి విశ్రాంతి కరువవుతుంది. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో పోటీదార్ల నుంచి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు ఆశించిన విధంగా వృద్ధిలోకి వస్తారు. కుటుంబ సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.
ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి చెందడానికి వీలైన పరిస్థితులుంటాయి. వ్యాపారాల్లో కూడా మీ ఆలోచనలు, వ్యూహాలు పనిచేస్తాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలుంటాయి. జీవిత భాగ స్వామితో సామరస్యం పెరుగుతుంది. దైవ కార్యాలు, సహాయ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు.
శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలోనూ, వృత్తి జీవితంలోనూ ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాల శాతం వృద్ధి చెందుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాల్లో వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు కలసివస్తాయి. ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా ఆదరాభిమానాలకు లోటుండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
భాగ్యస్థానంలో ఉన్న గురు, శుక్రుల కారణంగా ఎక్కడా గౌరవ మర్యాదలకు లోటుండదు. కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో వృద్ధి కనిపిస్తుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం, ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధువులతో మాటలు పడాల్సి వస్తుంది. సంతానంలో ఒకరికి చదువులు లేదా ఉద్యోగపరంగా యోగం పట్టే అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు, మిత్రుల సహకారంతో పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రభుత్వపరంగా లబ్ధి పొందడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కొద్దిగా బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొందరు మిత్రుల వల్ల ఇబ్బంది పడతారు. పిల్లల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది. చదువులు లేదా ఉద్యోగాల విషయంలో విదేశాల నుంచి తగిన సమాచారం అందుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
ఈ రాశికి పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం, చతుర్థ స్థానంలో కుజ సంచారం ఒక అరుదైన అదృష్ట యోగాన్ని కలగజేస్తోంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కఠినంగా కాకుండా సామరస్యంతో వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది.
ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. పిల్లలు చదువుల్లో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. సొంత డ్రైవింగ్ లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి.