వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. ఐటి వంటి వృత్తి నిపుణులకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. చాలాకాలంగా బాధ పెడుతున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు.
ఆర్థిక, పెళ్లి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి.
ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారితీస్తాయి. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి సహాయ
సహకారాలు లభిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది.
ఉద్యోగ పరంగా మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకోకుండా పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో బాగా లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు.
మీ స్తోమతకు మించి ఇతరులకు ఆర్థికంగా సహాయపడతారు. కొందరు స్నేహితుల ద్వారా ఉద్యోగ పరంగా లబ్ధి పొందుతారు. ఆర్థిక వ్యవహారాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకుంటే మంచిది. తల్లిదండ్రుల నుంచి లేదా తోబుట్టువల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.
కుటుంబ పరంగా మంచి నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టండి. కుటుంబ సభ్యులలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. తోబుట్టులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి.
ఆర్థిక పరిస్థితి కొద్దిగా నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఆర్థిక సహాయం కోసం స్నేహితులు కొందరు ఒత్తిడి తీసుకువస్తారు.
అనవసర పరిచయాలకు, విలాసాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆర్థిక
లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది.
ముఖ్యమైన పనులలో కొన్ని విజయవంతంగా పూర్తి అవుతాయి. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త అందుతుంది. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
ఉద్యోగ పరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఆహార విహారాల్లో క్రమశిక్షణ పాటించడం మంచిది. వృత్తి వ్యాపారాలలో కొద్దిగా సమస్యలున్నా, ముందుకు దూసుకుపోతారు. పెళ్లి ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి. బంధువులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి.
కుటుంబ సభ్యులు, తోబుట్టువుల ద్వారా ప్రయోజనం పొందుతారు. దూరప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో ఊహించని విధంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి.
ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వారసత్వం ద్వారా లబ్ధి పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. స్నేహితులను గానీ, బంధువులను కానీ నమ్మి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. దూర ప్రాంతంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు సఫలం అవుతాయి.
ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. ప్రమోషన్ మీద బదిలీ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇష్టపడిన వారితో పెళ్లి ఖాయం అవుతుంది. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ పురోగతి సాధిస్తారు. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. వాగ్దానాలు, హామీలకు ఇది సమయం కాదు.
ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. స్నేహితుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయం లభించదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. అదనపు ఆదాయం, పెళ్లి ప్రయత్నాలు కొద్దిగానే సఫలం అవుతాయి. వృత్తి వ్యాపారాల మీద మరింత శ్రద్ధ అవసరం.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..