Horoscope Today: 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు.. వారికి ఉద్యోగంలో శుభ పరిణామాలు పక్కా..

మేష రాశి వారి మాటకు అందరిలోనూ విలువ మరింత పెరుగుతుంది. వృషభ రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారం (సెప్టెంబర్ 19, 2023) రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు.. వారికి ఉద్యోగంలో శుభ పరిణామాలు పక్కా..
Horoscope Today 19th September 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 19, 2023 | 5:01 AM

మేష రాశి వారి మాటకు అందరిలోనూ విలువ మరింత పెరుగుతుంది. వృషభ రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారం (సెప్టెంబర్ 19, 2023) రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. అందరిలోనూ మీ మాటకు మరింతగా విలువ పెరుగు తుంది. కొందరు బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంచనాలకు మించి అనుకూలిస్తాయి. ఉద్యోగాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలన్నట్టుగా సాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొందరు చిన్ననాటి స్నేహితులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. అదనపు ఆదాయ మార్గాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యమైన పనులను, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): శుభ గ్రహాల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశించిన దాని కంటే ఎక్కువ లాభాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవడం మంచిది. బంధువుల వివాదాల్లో తలదూర్చవద్దు. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఎక్కువగా ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. రాదనుకున్న డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. అదనపు ఆదాయ మార్గాల విషయంలో ప్రయత్నాలు పెరుగుతాయి. పొదుపు సూత్రాలను తుచ తప్పకుండా పాటిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. జీవిత భాగస్వామి కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు. శ్రమ, ఒత్తిడి కారణంగా విశ్రాంతి కరువవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటిం చడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ప్రతికూలతలు తప్పకపోవచ్చు. సహోద్యోగులు, సహచరులు బాగా ఇబ్బందులకు గురి చేస్తారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. జీవిత భాగస్వామికి అదృష్టం పడుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం అవుతాయి. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు ఫలప్రదం అవుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి శుభ వార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు మంచి ఫలి తాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా ముగుస్తాయి. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగు తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబసమేతంగా ఆలయ సంద ర్శనాలు చేసుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్తలు అందుతాయి. కుటుంబ జీవితంలో సామరస్యం ఏర్పడుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృత్తి జీవితంలో క్షణం కూడా విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపా రాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ వ్యవ హారాలను బాధ్యతగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. చిన్ననాటి స్తేహితులతో కలిసి విందు కార్య క్రమంలో పాల్గొంటారు. దైవ కార్యాల్లోనూ, సహాయ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఆరోగ్యం పరవా లేదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): తోబుట్టువులతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచ నలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయా ణాలు లాభిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!