Telugu News Astrology Chandra mangala yoga these zodiac signs to have sudden money luck details in telugu
Money Astrology: చంద్ర మంగళ యోగం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభానికి ఛాన్స్..!
ఈ నెల 24, 25, 26 తేదీల్లో కర్కాటక రాశిలో కుజ, చంద్రుల కలయిక జరుగుతోంది. ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల చంద్ర మంగళ యోగమనే ధన యోగం ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావం 27న కూడా కొనసాగుతుంది. ఈ యోగం వల్ల ఆదాయం బాగా పెరగడానికి, అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతం కావడానికి, ఆకస్మిక ధన లాభానికి, రావలసిన సొమ్ము వసూలు కావడానికి అవకాశం ఉంటుంది.
ఈ నెల 24, 25, 26 తేదీల్లో కర్కాటక రాశిలో కుజ, చంద్రుల కలయిక జరుగుతోంది. ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల చంద్ర మంగళ యోగమనే ధన యోగం ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావం 27న కూడా కొనసాగుతుంది. ఈ యోగం వల్ల ఆదాయం బాగా పెరగడానికి, అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతం కావడానికి, ఆకస్మిక ధన లాభానికి, రావలసిన సొమ్ము వసూలు కావడానికి అవకాశం ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశులకు ఇది తప్పకుండా ధనయోగాలనిస్తుంది.
మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజ, చంద్రుల యుతి జరుగుతున్నందువల్ల ఆర్థిక వ్యవహారాలతో పాటు ఆస్తి వ్యవహారాలు కూడా చక్కబడతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై ఆస్తి చేతికి అందుతుంది. భూ లాభాలు కలుగుతాయి. ఆస్తి క్రయ విక్రయాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు. సొంత ఇంటి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. అనేక విధాలుగా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద మదుపు చేయడానికి సమయం అనుకూలంగా ఉంది.
కర్కాటకం: ఈ రాశిలో రాశ్యధిపతి చంద్రుడు కుజుడిని కలుస్తున్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. అనుకోకుండా భూ లాభాలు కలుగుతాయి. తల్లితండ్రుల నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. షేర్లు కొనడానికి, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది.
కన్య: ఈ రాశికి లాభ స్థానంలో కుజ, చంద్రుల కలయిక వల్ల ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించి లాభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడ తాయి. ఆస్తి, గృహ ఒప్పందాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది.
తుల: ఈ రాశికి దశమ స్థానంలో చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు అదనపు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకు పోతాయి. ఎటువంటి ఆర్థిక ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరి ష్కారం అవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి లభిస్తుంది. సంపద బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.
వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఇక్కడ రాశ్యధిపతి కుజుడితో భాగ్యాధిపతి చంద్రుడు కలవడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విదేశీమూలక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అత్యధికంగా లాభాలు కలుగుతాయి.
మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో చంద్ర, కుజుల కలయిక ఏర్పడడం ఈ రాశివారికి అత్యంత శుభ ఫలితాలనిస్తుంది. ఆదాయపరంగా ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సాధించడం జరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కోర్టు కేసులు కూడా సానుకూలపడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించి సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.