Horoscope Today: రాశి ఫలితాలను ప్రజలు చాలా మంది విశ్వసిస్తారు, అనుసరిస్తుంటారు కూడా. రాశి ఫలాలను ఆధారంగా చేసుకుని రోజును ప్రారంభించే వారు మనలో చాలా మంది ఉంటారు. ఈరోజు శనివారం (ఏప్రిల్ 10) ఈ రాశి ఫలాల ఆధారంగా ఎవరు ఎలాంటి పనులు చేపట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏయే విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలు తెలుసుకుందాం.
మేషరాశి వారు బాకీలు వసూలు చేసేందుకు ఏ మాత్రం వెనుకడుగు వేయకూడదు. ఏవైనా పనులు చేసే ముందు పెద్దవారి ఆశ్వీర్వాదాలు తీసుకోవడం మంచిది. గురుగ్రహ అర్చన మంచి ఫలితాలు ఇస్తాయి.
ఈ రాశివారు వేర్వేరు సందర్భాలలో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటు మంచిది కాదు. అలాగే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. శనిశ్వర స్తోత్ర పారాయణం ఎంతో మేలు చేస్తుంది.
మిథునరాశి వారికి శ్రమాధిక్యత ఉంటుంది. చేయాల్సిన పనులను పూర్తి చేసుకోవడంలో నిదానంగా ఆలోచించడం ఎంతో మంచిది. ఈ రాశివారికి నవగ్రహ స్తోత్ర పారాయణం ఎంతో మేలు చేస్తుంది.
కర్కాటక రాశి వారికి శ్రమాధిక్యత ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఏ మాత్రం తొందరపడకూడదు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం ఎంతో మేలు చేస్తుంది.
ఈ రాశివారు వ్యవహారిక పనుల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వేర్వేరు వ్యక్తులను కలుసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. పేదవారికి అన్నదానం చేయడం ఎంతో మంచిది.
ఈ రాశివారికి ఈ రోజు చేపట్టే పనుల్లో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. ఈ రాశి వారికి నవగ్రహ స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.
ఈ రాశి వారు ఈ రోజు వృత్తి, ఇతర పనుల విషయాల్లో ముందు చూపుతో వెళ్లడం ఎంతో మంచిది. అష్టలక్ష్మీ పారాయణం ఎంతో మేలు చేస్తుంది.
ఈ రాశివారికి రాజకీయాల పరంగా కొంత ఒత్తిడికి లోనవుతుంటారు. ఆరోపణలు, ప్రత్యారోపణల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. శివారాధన మేలు చేస్తుంది.
ఈ రాశివారికి ఉద్యోగ, వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో కొంత ఇబ్బంది చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తుండాలి. ఈ రాశివారు దుర్గమ్మను ఆరాధించడం ఎంతో మంచిది.
ఈ రాశివారికి వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యమైన విషయాలను వాయిదా వేస్తుంటారు. ఈ రాశివారు రామరక్ష శాస్త్ర పారాయణం ఎంతో మేలు చేస్తుంటుంది.
కుంభరాశివారికి వ్యవహారిక విషయాల్లో పురోభివృద్ధి ప్రారంభం అవుతుంది. చర,స్తిర ఆస్తుల విషయాలలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. గణపతికి గరికను సమర్పించుకోవడం శుభప్రదం.
ఈ రాశివారికి సోదరుడితో విబేధాలు ఉంటాయి. ఆచి తూచీ వ్యవహరిస్తూ ఉండాలి. నవగ్రహాలకు పూజ చేయడం ఎంతో మేలు చేస్తుంటుంది.