హిందూ పూజల్లో ఉపయోగించే ద్రవ్యాల్లో అక్షతలకు ప్రముఖ స్థానం ఉంది. బియ్యం, పసుపు నెయ్యి కలిపి తయారు చేసే అక్షతలను దేవుళ్లను పూజించడానికి మాత్రమే కాదు.. పెద్దల దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకునే సమయంలో కూడా ఉపయోగిస్తారు. ఇలా చేయడం శుభప్రదం అని నమ్మకం. అదే విధంగా పూజ కోసం పీఠాన్ని ఏర్పాటు చేసి కలశ స్థాపన సమయంలో బియ్యం ముందుగా పోస్తారు. ఇలా బియ్యం లేకుండా ఎటువంటి కార్యక్రమం పని జరగదని చెప్పవచ్చు. ఇందులో తెల్ల బియ్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
బియ్యంలో వివిధ రకాలు ఉన్నాయి. బియ్యాన్ని వంటకాలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా పూజలో కూడా బియ్యాన్ని ఉపయోగిస్తారు. జ్యోతిషశాస్త్రంలో నాల్గవ స్థానం అక్షతలది అంటారు. బియ్యం పవిత్రమైనవిగా అన్నం పరబ్రహ్మ స్వరూపంగా పరిగణించబడుతుంది. భగవంతుని ఆరాధనతో సహా ఏదైనా శుభకార్యానికి బియ్యాన్ని ఉపయోగిస్తారు.
అయితే చాలా కొద్ది మందికి మాత్రమే వైట్ రైస్ కాకుండా బ్లాక్ రైస్ ఉపయోగించి కొన్ని నివారణ చర్యలు చెయ్యవచ్చు అని కొంతమందికి మాత్రమే తెలుసు. ఇలా నల్లబియ్యం తో చేసే నివారణ చర్యలతో జీవితంలో సుఖ శాంతులను, సిరి సంపదలను పొందవచ్చు. ఈ రోజు మనం జీవితంలోని సమస్యలను దూరం చేసే బ్లాక్ రైస్ చిట్కాలను గురించి తెలుసుకుందాం..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)