వెంటిలేటర్‌పై చికిత్స.. మరింత క్షీణించిన జైట్లీ ఆరోగ్యం

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. సొంతంగా శ్వాస తీసుకునేందుకు ఆయన ఇబ్బంది పడుతున్నారని.. అందుకే లైఫ్ సపోర్ట్‌పై ఉంచినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఆయనకు ఈసీఎంఓను అమర్చినట్లు వారు వెల్లడించారు. మరోవైపు ఆసుపత్రికి వెళ్లిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్, కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ జైట్లీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాజాగా బీఎస్పీ అధినేత మాయావతి సైతం ఎయిమ్స్‌కు వెళ్లారు. కాగా […]

వెంటిలేటర్‌పై చికిత్స.. మరింత క్షీణించిన జైట్లీ ఆరోగ్యం
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 4:56 PM

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. సొంతంగా శ్వాస తీసుకునేందుకు ఆయన ఇబ్బంది పడుతున్నారని.. అందుకే లైఫ్ సపోర్ట్‌పై ఉంచినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఆయనకు ఈసీఎంఓను అమర్చినట్లు వారు వెల్లడించారు. మరోవైపు ఆసుపత్రికి వెళ్లిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్, కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ జైట్లీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాజాగా బీఎస్పీ అధినేత మాయావతి సైతం ఎయిమ్స్‌కు వెళ్లారు. కాగా ఈ నెల 9న తీవ్ర అస్వస్థతకు గురైన జైట్లీని ఎయిమ్స్‌కు తరలించారు. నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సహాయమంత్రి అశ్విని చౌబేలు శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి.. ఆయన ఆరోగ్య వివరాలు తెలుసుకున్న విషయం తెలిసిందే.