AP News: వైసీపీకి వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలతో కూడిన శాసనసభకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో పార్టీల్లో జంపింగ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీకి చెందిన పలువరు సిట్టింగ్‌లు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరుతున్నారు.

AP News: వైసీపీకి వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే
Mla Vunnamatla Eliza - YS Sharmila
Follow us

|

Updated on: Mar 24, 2024 | 5:50 PM

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అధికార వైసీపీకి షాక్‌మీద షాక్ తగులుతుంది. వైసీపీని ఆపార్టీ ఎమ్మెల్యేలు వరుసగా వీడుతున్నారు. తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అయితే ప్రస్తుతం ఎలిజా చింతలపూడి ఎమ్మెల్యేగా ఉండగా.. ఆయనను కాదని.. జగన్ కుంభం విజయరాజకు టికెట్ ఇచ్చారు. దీంతో చిన్నబుచ్చుకున్న ఎలిజా.. వైసీపీ వీడి.. కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు.

అలాగే నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సైతం.. పార్టీకి గుడ్‌ బై చెప్పి బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. మాజీ IAS అధికారి అయిన వరప్రసాద్ 2009లో ప్రజారాజ్యం నుంచి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2014లో మరోసారి తిరుపతి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గూడూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీలో చేరిన వరప్రసాద్‌ను బద్వేల్ బరిలో నిలిపే ఆలోచనలో ఉంది బీజేపీ అధిష్టానం.

ఈనెల 19న నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్థర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్థర్ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు YS షర్మిల సమక్షంలో కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఆర్థర్‌ని కాదని నందికొట్కూరు వైసీపీ టికెట్ డా.దారా సుధీర్ కు కేటాయించింది వైసీపీ అధిష్టానం. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో విభేదాల నేపథ్యంలో ఆర్థర్ టికెట్ కోల్పోవాల్సి వచ్చింది. దీంతో నందికొట్కూరు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థర్ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈసారి ఎన్నికల బరిలో నిలవాలని చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

వివిధ సమీకరణాల కారణంగా ఆయా ప్రాంతాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను సీఎం జగన్ మార్చారు. దీంతో టికెట్ దక్కని నేతలు మొత్తం వైసీపీకి గుడ్‌బై చెబుతూ వేరే పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ, బీజేపీలో చేరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..