Viral: మానవత్వం అంటే ఇదేకదా.! కదల్లేని స్థితిలో ఉన్న కుక్కను కాపాడిన యువకుడు.. ఏం చేశాడో చూస్తే..!

| Edited By: Ravi Kiran

Jan 04, 2024 | 1:12 PM

ఈ మధ్యకాలంలో కుక్కలు మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే వీధికుక్కలను పట్టుకోవాలంటూ మున్సిపల్ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. రెండు రోజుల క్రితం గుంటూరు సంపత్ నగర్ శివాలయం వద్ద కూడా ఆరేళ్ల బాలుడిపై ఐదు కుక్కలు దాడి చేశాయి.

Viral: మానవత్వం అంటే ఇదేకదా.! కదల్లేని స్థితిలో ఉన్న కుక్కను కాపాడిన యువకుడు.. ఏం చేశాడో చూస్తే..!
Viral Video
Follow us on

ఈ మధ్యకాలంలో కుక్కలు మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే వీధికుక్కలను పట్టుకోవాలంటూ మున్సిపల్ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. రెండు రోజుల క్రితం గుంటూరు సంపత్ నగర్ శివాలయం వద్ద కూడా ఆరేళ్ల బాలుడిపై ఐదు కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఒక యువకుడు మాత్రం మానవత్వాన్ని చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయిన కుక్కను రక్షించి వైద్యం అందిస్తున్న యువకుడిని పలువురు ప్రశంసిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. రెండు నెలల క్రితం అమరావతి రోడ్డులోని ద్వారకా నగర్ వద్ద ఒక వాహనం వీధికుక్కను ఢీ కొట్టింది. అనంతరం కుక్కపై నుంచి వెనుక నుంచి వస్తున్న ఆటో ఎక్కేసింది. దీంతో కుక్క నడుము పూర్తిగా విరిగిపోయి కదల్లేని స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే ద్వారకా నగర్ కాలనీలో ఉండే బండ్లమూడి గోపాలక్రిష్ణ కుక్క పరిస్థితి గమనించి ‘అయ్యో పాపం’ అనుకున్నాడు. వెంటనే కుక్కను పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ చక్రవర్తికి చూపించాడు. శునకం పరిస్థితిని గమనించిన వైద్యుడు కోలుకునే అవకాశం ఉందని చెప్పడంతో ప్రతిరోజూ ఫిజియోథెరపి చేస్తున్నారు. నడుము, వెనుక కాళ్లు పనిచేయకపోవడంతో రెండు చక్రాల బండిని కుక్కకు అమర్చాడు. దీంతో కొంతమేర కుక్క నడవగలుగుతోంది.

మొదట్లో ఎవరిని దగ్గరకు రానివ్వని వీధి శునకం ఇప్పుడు గోపాలక్రిష్ణకు అలవాటైంది. చక్రాల బండి సాయంతో చిన్న చిన్నగా నడవడం మొదలుపెట్టింది. అయితే పూర్తిగా కోలుకోవటానికి మరికొంత సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. అప్పటివరకూ దాని ఆలనా పాలనా చూస్తున్నట్లు గోపాలక్రిష్ణ తెలిపాడు. మొదట శునకం పరిస్థితి చూసి జాలీ వేసిందని ఏదో ఒకటి చేయాలని నిర్ణయించి దాన్ని సంరక్షించే ప్రయత్నం చేస్తున్నానన్నాడు. గోపాలక్రిష్ణ తీసుకుంటున్న చర్యలను పలువురు అభినందిస్తున్నారు.