White Ration Card: సబ్ కలెక్టర్‌కు రేషన్ కార్డు.. ఇదేంటంటూ తహసీల్దార్‌ను నిలదీసిన ప్రజలు..

| Edited By: Pardhasaradhi Peri

Jan 19, 2021 | 2:13 PM

White Ration Card: సాధారణంగా తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు?.. దారిద్ర్య రేఖకు దిగువున్న వారికి తెల్ల రేషన్ కార్డు ఇస్తారు. మరి ప్రభుత్వం నుంచి..

White Ration Card: సబ్ కలెక్టర్‌కు రేషన్ కార్డు.. ఇదేంటంటూ తహసీల్దార్‌ను నిలదీసిన ప్రజలు..
Follow us on

White Ration Card: సాధారణంగా తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు?.. దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి తెల్ల రేషన్ కార్డు ఇస్తారు. మరి ప్రభుత్వం నుంచి అన్ని వసతులు, సౌలభ్యాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిగానే పరిగణిస్తారా?. శ్రీకాకుళంలో పరిగణిస్తారు. అసలు విషయం ఏంటంటే.. సాధారణంగా నిరుపేదలకే ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు జారీ చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఓ సబ్ కలెక్టర్‌కు తెల్ల రేషన్ కార్డు ఉంది. దీనిపై ఇప్పుడు పెద్ద రచ్చ నడుస్తోంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పరిధిలోని పారసంబ గ్రామానికి చెందిన రోణంకి గోపాలకృష్ణ సబ్‌ కలెక్టర్‌గా ఎంపికయ్యారు.

ఆయన ప్రస్తుతం నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయితే తాజాగా ఆయన పేరిట రేషన్ ఉన్నట్లు తేలింది. పారసంబలోని గోపాలకృష్ణ తల్లిదండ్రులకు రేషన్ కార్డు ఉంది. ఆ కార్డులో గోపాల కృష్ణ పేరు కూడా ఉంది. దాన్ని గమనించిన గ్రామస్తులు మండల తహశీల్దార్‌ను నిలదీశారు. ఒక సబ్ కలెక్టర్‌కు రేషన్ కార్డ్ ఎలా ఇస్తారంటూ ఫైర్ అయ్యారు. కాగా, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ప్రజలకు హామీ ఇచ్చారు. దాంతో వారు శాంతించారు.

Also read:

India Vs Australia 2021:ఆస్ట్రేలియాపై భారత్ సంచలన విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా..

Sridevi Younger Daughter Debut: వెండి తెరపై అడుగు పెట్టనున్న అతిలోక సుందరి శ్రీదేవి మరో వారసురాలు