Baby Kidnap in KGH: చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం.. కిడ్నాపర్ల చెర నుంచి తల్లి ఒడికి

విశాఖ కేజీహెచ్ లో (Visakhapatnam KGH) చిన్నారి ఆపహరణ కథ సుఖాంతమైంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల సమీపంలో నిందితులను గుర్తించిన పోలీసులు చిన్నారితో పాటు వారినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శిశువు...

Baby Kidnap in KGH: చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం.. కిడ్నాపర్ల చెర నుంచి తల్లి ఒడికి
Kgh Kidnap

Updated on: Mar 17, 2022 | 3:12 PM

విశాఖ కేజీహెచ్ లో (Visakhapatnam KGH) చిన్నారి ఆపహరణ కథ సుఖాంతమైంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల సమీపంలో నిందితులను గుర్తించిన పోలీసులు చిన్నారితో పాటు వారినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శిశువు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విశాఖ కేజీహెచ్(KGH) నుంచి చిన్నారిని కిడ్నాప్ చేసిన దుండగులు కేజీహెచ్ నుంచి గురుద్వారాకు ఆటోలో, అక్కడి నుంచి కారులో శ్రీకాకుళం (Srikakulam) వైపు బయలుదేరినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టగా.. నిందితులను పట్టుకున్నట్లు వివరించారు. చిన్నారి కిడ్నాప్ వెనుక ఎవరెవరు ఉన్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నామన్నారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలోని రేవిడి రౌతులపాలెం గ్రామానికి చెందిన మజ్జి అప్పయ్యమ్మ కేజీహెచ్ లోని గైనిక్ వార్డులో ఈనెల 11న చేరింది. ఈనెల 13న పాపకు జన్మనిచ్చింది. సిజేరియన్ కావడంతో తల్లి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ క్రమంలో గత మంగళవారం సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో గుర్తు తెలియని మహిళలిద్దరూ ఆ వార్డులోకి వెళ్లి పసికందును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఆ సమయంలో పసికందు అమ్మమ్మ అక్కడే ఉన్నారు. ఆస్పత్రి సిబ్బంది అనుకుని పసికందును ఆ మహిళలిద్దరికీ ఇచ్చినట్టు చెబుతోంది ఆ మహిళ.

పాపను తీసుకెళ్లి చాలా సమయం గడవడంతో ఆ మహిళలు, చిన్నారిని తీసుకుని రాకపోవడంతో పసికందు తల్లి కంగారు పడింది. దీంతో వార్డులోని సిబ్బంది అక్కడికి చేరుకుని తల్లితో మాట్లాడారు. పసికందు అపహరణకు గురైనట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని గైనిక్ గేటు ఎదురుగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. గుర్తు తెలియని మహిళ, పసికందును తీసుకొని వేగంగా నడుచుకుంటూ వార్డు లోపలినుండి బయటకు పారిపోయినట్టు రికార్దాయింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడి ఆటో స్టాండ్ లో విచారించగా ఇద్దరు మహిళలు పసికందును తీసుకొని ఆటోలో గురుద్వారా చేరుకొని విజయ డయాగ్నస్టిక్ బస్టాప్ వద్ద దిగినట్టు తెలుసుకున్నారు. తాజాగా పోలీసులు కిడ్నాపర్లను పట్టుకున్నారు.

Also Read

Kidney Stone: మీరు కిడ్నీ స్టోన్‌తో ఇబ్బంది పడుతుంటే.. ఈ విషయాలకు దూరంగా ఉండండి..

Viral Photo: బూరె బుగ్గల చిన్నారి.. ఎందుకమ్మా అంత కోపం.! ఈ క్యూట్ బుజ్జాయిని గుర్తుపట్టండి..

అనంతలో మారని కాకీల తీరు.. తెల్లకాగితాలపై సంతకాలు..రైతు కుటుంబంపై అరాచకం..

 

Loading...
Unable to load recommendations.
Follow Us