వైసీపీ యువ నాయకుడు భైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సీఎం కాన్వాయ్ ముందు నడుచుకుంటూ వెళ్తున్న సిద్ధార్థ రెడ్డిని ఆయన సెక్యూరిటీ పక్కకు తోసేశారు. దీంతో సెక్యూరిటీతో భైరెడ్డి వాగ్వాదానికి దిగారు.
కాగా కంటి వెలుగు మూడో విడుత ప్రారంభోత్సంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కర్నూల్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎంకు ఆహ్వానం పలికేందుకు సిద్ధార్థ రెడ్డి అక్కడకు వెళ్లగా.. ఈ ఘటన చేసుకోంది. వెంటనే అటుగా వచ్చిన కొందరు నేతలు సెక్యూరిటీ సిబ్బందికి, బైరెడ్డికి నచ్చచెప్పి పంపడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. అయితే బైరెడ్డిని అడ్డుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఈ వ్యవహారంపై బైరెడ్డి అభిమానులు, అనుచరులు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read This Story Also:మీరట్‌లో ఎన్‌కౌంటర్.. తెలుగు డాన్ హతం..!