ఆ విషవాయువు పీల్చితే ఏమవుతుంది ?

విశాఖపట్నంలో  స్టెరీన్ విషవాయువుకు సుమారు రెండువేల మందికి పైగా గురయ్యారు. తెల్లవారు జామున సుమారు రెండు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఈ వాయువు లీక్ కావడంతో గాఢ నిద్రలో ఉన్న చాలామంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు...

  • Umakanth Rao
  • Publish Date - 11:40 am, Thu, 7 May 20
ఆ విషవాయువు పీల్చితే ఏమవుతుంది ?

విశాఖపట్నంలో  స్టెరీన్ విషవాయువుకు సుమారు రెండువేల మందికి పైగా గురయ్యారు. తెల్లవారు జామున సుమారు రెండు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఈ వాయువు లీక్ కావడంతో గాఢ నిద్రలో ఉన్న చాలామంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపు అయిదు కిలోమీటర్ల దూరం మేరా ఈ వాయువు వ్యాపించడంతో దీని ప్రభావం జనాలపై అధికంగా పడింది. పిల్లలు, మహిళలు, వృధ్ధులు, చివరకి పోలీసులు శాతం ఈ వాయువుకు గురయ్యారు. అనేకమంది స్పృహతప్పారు. ఇంటినుంచి బయటకు  పరుగెత్తిన వారిలో అనేకమంది మధ్య దారిలోనే కింద పడిపోయారు. హృదయ విదారక దృశ్యాలతో విశాఖ వీధులు విషాదంతో నిండాయి. ఈ నగరంలోని కేజీహెచ్ ఆసుపత్రి ఈ విషాదానికి గురైన వారితో నిండిపోయింది. దాదాపు 80 వెంటిలేటర్లతో వీరికి చికిత్స చేస్తున్నారు డాక్టర్లు..

స్టెరిన్ వాయువు పీల్చితే మొదట నాడీ మండల వ్యవస్థ దెబ్బ తింటుంది. దీని ప్రభావం కిడ్నీలపైనా పడుతుంది. క్రమంగా అవి పని చేయడం మానివేస్తాయి. తలనొప్పి, డిప్రెషన్, కళ్ళు మండడం, వినికిడి శక్తి తగ్గిపోవడం, చివరకు క్యాన్సర్ ముప్పుసైతం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఒకప్పుడు మధ్యప్రదేశ్ లోని భోపాల్ గ్యాస్ ప్రమాదంతో ఈ ఘటనను పోలుస్తున్నారు. భోపాల్ లోని కార్బైడ్ ఫ్యాక్టరీనుంచి నాడు గ్యాస్ లీకయి అనేకమంది తీవ్ర అస్వస్థకు గురి కాగా..పలువురు  మృతి చెందారు. బతికి బట్ట కట్టినవారిలో చాలామంది ఇప్పటికీ ఈ గ్యాస్ తాలూకు రుగ్మతలను అనుభవిస్తున్నారు. కొంతమందికి కంటిచూపు పోయింది.