Andhra Pradesh: విశాఖ ఆర్కే బీచ్‌లో భర్తకు మస్కా కొట్టి ప్రియుడితో జంప్ అయిన సాయి ప్రియ కేసులో ట్విస్టులు ఇంకా కొనసాగుతున్నాయి. లవర్ రవితో తాను మనస్పూర్తిగా వెళ్లిపోయానని.. అతడ్ని మ్యారేజ్ చేసుకున్నానని ఆమె ఇటీవల పేరెంట్స్‌కు మెసేజ్ పెట్టింది. అంతేకాదు రవి కట్టిన పసుపు తాళితో ఉన్న ఫోటోను సైతం సెండ్ చేసింది. అనవసరంగా అధికారులకు శ్రమ కలిగించినందకు సారీ చెప్పింది. ప్రియుడి తల్లిదండ్రుల జోలికి కూడా వెళ్లవద్దని వేడుకుంది. తమ కోసం వెతకవద్దని.. ఒకవేళ వెతికితే ఆత్మహత్యే శరణ్యం అని కూడా వార్నింగ్ ఇచ్చింది. సాయిప్రియకు ఇష్టం లేకున్నా మొదటి వివాహం చేశారని సీన్ అర్థమైపోతుంది. తాజాగా ఆమె ప్రియుడితో కలిసి వైజాగ్ వచ్చింది. బంధువుల నుంచి తన ప్రాణాలకు ముప్పు వుందని విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మొదటి భర్త శ్రీనివాస్ పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా బహుమతిగా ఇచ్చిన బంగారు గాజులు అమ్మి ఈ రెండు రోజులు ప్రియుడు రవితో గడిపినట్టు పోలీసులకు తెలిపింది. వాటిని తిరిగి ఇచ్చేస్తానని వెల్లడించింది. భర్త దగ్గరి నుంచి అలా వెళ్లిపోయినందుకు క్షమాపణలు కోరింది. శ్రీనివాస్ తో వివాహానికి ముందే తమ ప్రేమ వ్యవహారం తల్లి తండ్రులకు చెప్పానని తెలిపింది. చిన్ననాటి నుంచి రవి తనకు మిత్రుడని చెప్పింది. పెళ్లయిన అమ్మాయిని అలా తీసుకుని వెళ్లడం తప్పే అని సాయి ప్రియ లవర్ రవి ఒప్పుకున్నాడు. చదువుకున్నానని….ఉద్యోగం చేసి ఆమెను పోషించుకుంటానని తెలిపాడు. సెర్చ్ ఆపరేషన్ కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టిందని.. అధికారులు క్షమించాలని సాయి ప్రియ, రవి కోరారు. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. శనివారం సాయి ప్రియను, ఆమె భర్త శ్రీనివాస్‌ను స్టేషన్‌కి పిలిపించి ఇద్దరికీ కౌన్సిలింగ్ చేయాలని పోలీసుల డిసైడయ్యారు. సాయి ప్రియ మేజర్ కావడంతో ఆమె ఇష్టప్రకారం నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆమె మానసిక స్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కాగా ఇక్కడ ప్రధానంగా ఇంకో విషయం కూడా ఆలోచించాలి. సాయి ప్రియ పేరెంట్స్‌కూ కౌన్సిలింగ్ ఇవ్వాలి. వారికి కూడా ధైర్యం చెప్పాలి. 2 రోజులుగా మీడియాలో ఈ వార్తలు అన్ని విని వారు చాలా ఇబ్బంది పడి ఉంటారు. లోలోపల కుమిలిపోయి ఉంటారు. వారి కుటుంబానికి సన్నిహితంగా ఉండే బంధువులు, స్నేహితులు.. పక్కనే ఉండి ఈ సమయంలో ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి