కరోనా ఎఫెక్ట్‌: నంద్యాలలో పది రోజుల లాక్‌డౌన్‌

| Edited By:

Jul 14, 2020 | 3:52 PM

దేశవ్యాప్తంగా అన్‌లాక్‌డౌన్ ప్రక్రియ ఎప్పటి నుంచో మొదలైంది. అయితే లాక్‌డౌన్ సడలింపుల తరువాత కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

కరోనా ఎఫెక్ట్‌: నంద్యాలలో పది రోజుల లాక్‌డౌన్‌
Follow us on

దేశవ్యాప్తంగా అన్‌లాక్‌డౌన్ ప్రక్రియ ఎప్పటి నుంచో మొదలైంది. అయితే లాక్‌డౌన్ సడలింపుల తరువాత కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో అధికారులు మళ్లీ లాక్‌డౌన్ పెడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ని విధించుకుంటున్నారు. తాజాగా నంద్యాలలో 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు అధికారులు. ఈ మేరకు వారు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

బుధవారం నుంచి ఈ నెల 25 వరకు నంద్యాలలో అత్యవసర సర్వీసులకు మాత్రమే సడలింపు ఇచ్చారు. ఇక నిత్యావసర సరుకులు, రిటైల్‌ కూరగాయల అమ్మకాలకు ఉదయం 6గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే అనుమతిని ఇవ్వనున్నారు. ఆ తరువాత లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట కృష్ణ మాట్లాడుతూ.. బయటకు వచ్చే వారు ప్రతి వ్యక్తి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు.