ఒకే స్కూల్‌లో 29 మంది విద్యార్థులకు కరోనా.. కర్నూల్‌ డీఈవో కీలక ఆదేశాలు

| Edited By:

Oct 20, 2020 | 9:01 AM

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7 లక్షలను దాటేసింది

ఒకే స్కూల్‌లో 29 మంది విద్యార్థులకు కరోనా.. కర్నూల్‌ డీఈవో కీలక ఆదేశాలు
Follow us on

Students test positive Corona: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7 లక్షలను దాటేసింది. ఇదిలా ఉంటే కర్నూల్ జిల్లా శ్రీశైలం సున్నిపెంటలోని ఓ స్కూల్‌లో 29 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఇటీవల జరిపిన కరోనా పరీక్షల్లో వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో డీఈవో సాయిరాం కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో టెస్ట్‌లు చేయాలని ఆదేశించారు. స్కూళ్లలో కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా వచ్చే నెల 2వ తేది నుంచి ఏపీలో పాఠశాలలు తెరుచుకోనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.

Read More:

కనిపించే‌ మూడు సింహాలు పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులే: సాయి కుమార్

Bigg Boss 4: మోనాల్‌ కోసం అరియానా రాయబారం.. నోరు జారిన అభిజిత్‌