Avanthi srinivas : అవంతికి ప్రతిష్టాత్మకంగా విశాఖ ఎన్నికలు, భుజాలపై కుమార్తె ప్రియాంకను గెలిపించుకోవాల్సిన బాధ్యత.!

Avanthi srinivas daughter Lakshmi Priyanka :  విశాఖ GVMCఎన్నికలు మంత్రి అవంతి శ్రీనివాస్‌కి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఓవైపు అత్యధిక స్థానాల్లో వైసీపీని గెలిపించడంతో పాటు 6వ వార్డు..

Avanthi srinivas : అవంతికి ప్రతిష్టాత్మకంగా విశాఖ ఎన్నికలు, భుజాలపై కుమార్తె ప్రియాంకను గెలిపించుకోవాల్సిన బాధ్యత.!
Minister Avanti

Updated on: Mar 08, 2021 | 3:53 PM

Avanthi srinivas daughter Lakshmi Priyanka :  విశాఖ GVMCఎన్నికలు మంత్రి అవంతి శ్రీనివాస్‌కి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఓవైపు అత్యధిక స్థానాల్లో వైసీపీని గెలిపించడంతో పాటు 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్న తన కుమార్తె లక్ష్మీప్రియాంకను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై పడింది. ఎన్నికల ప్రచారానికి సమయం ముగుస్తుండడంతో కుమార్తెతో కలిసి 6వ వార్డులో ప్రచారం చేశారు అవంతి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి తమకు మేయర్ పీఠాన్ని అప్పగిస్తుందని మంత్రి ధీమా వ్యక్తంచేశారు. మరోవైపు మంత్రి కుమార్తె లక్ష్మీప్రియాంక మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న ఆదరణ చూసి…ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు. ఇక, GVMC ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఆయన కుమార్తె లక్ష్మీప్రియాంక అంటున్నారు.

Read also : YS Sharmila : అన్నింటా మనం.. అన్నింటా సగం, ఇదే మన సంకల్పం : ఓరుగల్లు కోట ముందు రాణీ రుద్రమదేవిలా వైఎస్ షర్మిల