అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు

అక్టోబర్ 17 నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు

Updated on: Sep 04, 2020 | 1:39 PM

Vijayawada Kanaka Durga: అక్టోబర్ 17 నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. ఇక కరోనా నేపథ్యంలో టైం స్లాట్‌ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈసారి అమ్మవారి దర్శనానికి అనుమతిని ఇవ్వనున్నారు. కాగా దసరా నేపథ్యంలో రోజుకు 9 వేల మందికి దర్శనం కల్పించాలా…? లేక సంఖ్య పెంచాలా..? అన్న దానిపై దుర్గ గుడి అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

అమ్మవారు ఏయే రోజు ఎలా దర్శనమివ్వనున్నారంటే:

  • అక్టోబర్ 17న శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి
  • 18న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
  • 19న శ్రీ గాయత్రీ దేవి
  • 20న శ్రీ అన్నపూర్ణాదేవి
  • 21న మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవి
  • 22న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
  • 23 న శ్రీ మహాలక్ష్మీ దేవి
  • 24న శ్రీ దుర్గాదేవి, శ్రీ మహిషా సుర మర్ధనీ దేవిగా రెండు అలంకారాలు
  • 25 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గమ్మ కనిపించనున్నారు.

ఇక 25వ తేదీన సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం జరగనుంది. దీంతో దసరా మహోత్సవాలు ముగియనున్నాయి.

Read More:

ప్రభాస్ మూవీకి అడ్వాన్స్‌ తీసుకోని దీపిక.. ఏం జరుగుతోంది..!

నెట్‌ఫ్లిక్‌లో ఈ సినిమాలు, వెబ్‌సిరీస్‌ని ఫ్రీగా చూడొచ్చు

Loading...
Unable to load recommendations.
Follow Us